Saturday, April 27, 2024
- Advertisement -

తమిళనాట సంపూర్ణ లాక్ డౌన్

- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీ ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అయితే ప్రధాని మోదీ సంపూర్ణ లాక్ డౌన్ వైపు మొగ్గు చూపలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని రాష్ట్రాలు లాక్‌ డౌన్ లోకి వెళ్లి పోతున్నాయి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ లాక్‌ డౌన్ కు సిద్దం అయ్యింది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. తాజాగా ఈనెల 10వ తారీకు నుండి తమిళనాడు లో సంపూర్ణ లాక్ డౌన్‌ ను విధించబోతున్నట్లుగా ప్రకటించారు. సీఎం స్టాలిన్‌ తమిళనాట పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. సంపూర్ణ లాక్ డౌన్ తో కిరాణా షాపులు మినహా మొత్తం మూత పడబోతున్నాయి.

పబ్లిక్ మరియు ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్‌ పూర్తిగా నిలిపి వేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈనెల 10 నుండి 24వ తారీకు వరకు సంపూర్ణ లాక్ డౌన్ ను విధించనున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తమిళనాడు సర్కార్ వెల్లడించింది. ఇతర రాష్ట్రాల నుండి రాక పోకలు పూర్తిగా బంద్ చేస్తున్నారు.

స్టాలిన్ మంత్రివర్గంలో ఐదుగురు తెలుగు వారు.. ఎవరో తెలుసా!

కొత్త అవతారం ఎత్తిన బండ్ల గణేశ్!

నా భార్య గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు : అనుపమ్ ఖేర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -