Thursday, May 9, 2024
- Advertisement -

అన్నీ విభజించడం సాధ్యమేనా?

- Advertisement -

తెలంగాణలో న్యాయాధికారుల నియామకం.. జడ్జిల సస్పెన్షన్ వ్యవహారం.. రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును.. తెలంగాణ లాయర్లు, రాజకీయ నాయకులు కార్నర్ చేస్తున్నారు. అవసరమైతే.. హైదరాబాద్ లో స్థలం కేటాయిస్తాం.. ప్రత్యేక హై కోర్టు ఏర్పాటు చేసుకోండి అంటూ.. తెలంగాణ అధికార పార్టీ నాయకులు కూడా సూచిస్తున్నారు. రీసెంట్ గా.. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర జరిగిన లాయర్ల మహా ధర్నాకు పార్టీలకు అతీతంగా నేతలు మద్దతు తెలిపి.. వారి తరఫున మేమున్నామని చెప్పడమే కాదు.. చంద్రబాబు ప్రభుత్వాన్నే అంతా కలిసి టార్గెట్ చేశారు.

ఈ పరిస్థితి తమ మెడకు చుట్టుకుంటుందేమో అన్న అనుమానం.. ఏపీ టీడీపీ నాయకుల్లో మొదలైనట్టే కనిపిస్తోంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసిన కామెంట్లు గమనిస్తే.. ఈ అనుమానాలు బలపడుతున్నాయి. తెలంగాణ లాయర్లు కోరుతున్నట్టు.. విభజన అంటూ చేస్తే.. ఒక్క హై కోర్టునే విభజిస్తే సరిపోదని సుజనా కామెంట్ చేసి వార్తల్లోకి వచ్చారు. ఢిల్లీలోని ఏపీ భవన్ తో పాటు.. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల పరిధిలో ఉన్న సంస్థలు కూడా రెండు రాష్ట్రాలకు పంచాల్సి వస్తుందని స్టేట్ మెంట్ ఇచ్చారు.

ఈ సమస్యను పరిష్కరించాల్సింది కేంద్ర హోం శాఖ మాత్రమే అని.. చంద్రబాబు ప్రభుత్వానికి బాధ్యత లేదని అర్థం వచ్చేట్టుగా స్పష్టమైన కామెంట్లు చేశారు. విభజన చట్టంలో కూడా అదే విషయం పొందుపరిచి ఉందని కూడా సెలవిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో.. సుజనా చెప్పినట్టు.. హై కోర్టుతో పాటు.. అన్ని సంస్థలు విభజించడం సాధ్యమేనా అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -