Thursday, April 25, 2024
- Advertisement -

అక్కడ కూడా ట్రంప్ కి ఓటమి..!

- Advertisement -

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ విజయాన్ని మిషిగన్​ ధ్రువీకరించింది. రాష్ట్రంలో 1.54 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు స్పష్టం చేసింది. ఫలితంగా ఇక్కడి ఓట్ల లెక్కింపుపై సవాలు చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు చుక్కెదురైంది.

మిషిగన్​ రాష్ట్ర కాన్వాసర్ల బోర్డు 3-0 ఓట్లతో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించింది. మిషిగన్ చట్టం ప్రకారం 2.8 పర్సెంటేజ్ పాయింట్లతో గెలుపొందిన బైడెన్​కు 16 ఎలక్టోరల్ ఓట్లు లభించాయి.

కీలకమైన విదేశీ వ్యవహారాల శాఖను ఆంటోనీ బ్లింకెన్‌కు అప్పగించారు బైడెన్​. అంతర్గత భద్రత మంత్రిగా ప్రముఖ న్యాయవాది అలెజాండ్ర మాయోర్కస్‌ను ఎంపికచేశారు. ఈ పదవి చేపట్టనున్న తొలి లాటినో వ్యక్తి ఈయనే కావడం విశేషం.జాతీయ భద్రత సలహాదారుగా బైడెన్‌ సలహాదారుడు జేక్‌ సులివాన్‌ను నియమించారు. సీఐఏ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ అవ్రిల్‌ హేన్స్‌ను జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌గా ఎంపికచేశారు. సుదీర్ఘకాలం దౌత్యవేత్తగా పనిచేసిన లిండా థామస్‌ గ్రెన్‌ఫీల్డ్‌ను ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా నియమించారు. వీరంతా 2009-2017 మధ్య ఒబామా-బైడెన్‌ ప్రభుత్వంలో పనిచేసిన వారే.

సొంత విమనాలు ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

షార్ట్ ఫిలిమ్స్ తో పరిచమైన నటీనటులు..!

వెంకటేష్ వైఫ్ గురించి ఆసక్తికర విషయాలు..!

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -