Friday, May 10, 2024
- Advertisement -

రోడ్ల పై చెత్త ఏంటి… మంత్రి ” సీరియస్ “

- Advertisement -

సిద్దిపేట పట్టణంలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను మంత్రి హరీష్ రావు సోమవారం నాడు క్షేత్ర స్థాయిలో పరిశిలించారు. పట్టణంలో 2, 3 ,7, 31 వార్డులో అండర్ గ్రౌండ్ పనులను స్వయంగా తిరిగి తెలుసుకున్నారు. రూ 110కోట్లలో రూ 66కోట్ల తో, 44 కిమీ పనులు పూర్తి అయ్యాయి అని అన్నారు. మిగతా పనులు వేగవంతం చేయలన్నారు. అదే విధంగా రఊ116కోట్ల పనులకు టెండర్లు పూర్తి అయ్యాయి. పనులు కూడా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పనులలో రాజీపడేది లేదని, నాణ్యత తో కూడిన పనులు చేయలన్నారు. సిద్దిపేట పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 100 ఏళ్లకు పునాది అని, ప్రజల భాగస్వామ్యం, వారి సహకారం గొప్పది అని అన్నారు. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పనులు చేయాలన్నారు. పనులకు ప్రజలు కూడా సహకరించాలి అన్నారు. అండర్ గ్రౌండ్ లో భాగంగా ఛాంబర్ ల నిర్మాణాలు పటిష్టంగా చేపట్టాలన్నారు. మార్చి లోగా వరద నీటి కాలువలు పూర్తి కావాలన్నారు.

తడి ,పొడి చెత్తను వేరు చేయాలి…చెత్త బండి లో వేయాలి…
వార్డు పర్యటనలో భాగంగా ఇంటింటికి వేస్తున్న చెత్త సేకరణను మంత్రి హరీష్ రావు గారు పరిశీలించారు. తడి ,పొడి చెత్తను వేరు చేస్తూ చెత్త బండిలో వేయాలన్నారు. చెత్త వేరు చేస్తు ఇస్తున్నారాని మునిసిపల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్వచ్ సర్వేక్షన్ లో భాగస్వమ్యం అవుతున్నారా, మునిసిపల్ వారు వచ్చి చెప్పినారా అని ఆరా తీశారు. ప్రతి ఇంటికి తిరిగి స్వచ్ సర్వేక్షన్ లో ప్రజలు భాగస్వమ్యం అయ్యే విధంగా అవగాహన చేయాలని మునిసిపల్ కమిషనర్ కు సూచించారు.

రోడ్ల పై చెత్త ఏంటి…మంత్రి ” సీరియస్ “
పారుపల్లి వీధిలో నెహ్రూ పార్క్ వద్ద రోడ్డు పై ఉన్న చెత్తను చూసి మంత్రి సీరియస్ అయ్యారు. మునిసిపల్ సిబ్బంది ని పిలిచి ఈ చెత్త ఏంటని మండిపడ్డారు. రోడ్డు పై చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -