Saturday, April 27, 2024
- Advertisement -

అంబేడ్కర్ బాటలో సీఎం కేసీఆర్: హరీష్ రావు

- Advertisement -

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్​ అంబేడ్కర్​ అడుగుజాడల్లోనే నడుచుకుంటూ.. తెలంగాణను అభివృద్ధి పథంలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. అంబేడ్కర్​ 130వ జయంతోత్సవాలను అధికారికంగా సంబురంగా జరుపుకుంటున్నామని హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని ధర్మారెడ్డి పల్లిలో అంబేడ్కర్​ విగ్రహాన్ని మంత్రి హరీశ్​ రావు ఆవిష్కరించారు. అందరికీ సమానమైన ఓటు హక్కును కల్పించి.. రాజ్యాంగాన్ని రచించిన మహానీయుడు అంబేడ్కర్​ అని హరీశ్​ అన్నారు.

విభిన్న జాతులు, వర్గాల అభివృద్ధికి మూడంచెల వ్యవస్థను రూపకల్పన చేశారని కొనియాడారు. స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇలా ఒక మంచి ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేశారని వెల్లడించారు.

అంబేడ్కర్ బాటలో సీఎం కేసీఆర్ పయనిస్తూ.. ఎస్సీ, ఎస్టీలకు ‘దళిత్ ఎంపవర్​మెంట్’ కింద బడ్జెట్​లో రూ. వెయ్యి కోట్లు కేటాయించామని హరీశ్​ తెలిపారు. దళిత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

తమిళనాడులో ఘోరం.. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..

IPL 2021 : క్షమాపణ కోరిన షారూఖ్ ఖాన్.. అందుకేనా?

కరోనా వచ్చిందని ప్రాణం తీసుకుంది.. ఎందుకంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -