Friday, May 3, 2024
- Advertisement -

కేబినెట్ మీటింగ్ అంటే బాబు మంత్రులకు కంగారే

- Advertisement -

కేబినెట్ మీటింగ్ అంటే సాధారణ ప్రజానీకం దృష్టిలో మంత్రులు, ముఖ్యమంత్రి జరుపుకొనే సమావేశం.

రాష్ట్ర ప్రగతి గురింఛి ఇతర బాగోగుల గురించి జరుపుకొనే చర్చ.. అవసరమైన అధికారులు తప్ప మరొకరికి కూర్చునే అధికారం ఉండదు. అయితే ఇదంతా గతం. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ సారి  బాబు బాధ్యతలు స్వీకరింఛిన అనంతరం కేబినెట్ మీటింగ్ సీన్ మారిఫోయింది.

మరి మంత్రులపైన నమ్మకం లేకనో అధికారులపై అతి నమ్మకమో బాబు మంత్రులకు మించిన స్థాయిలో అధికారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపి ప్రభుత్వ ముఖ్య అధికారులు ఈ మధ్య ఎక్కువగా కేబినెట్ మీటింగ్‌లో కనబడుతున్నారు.. ఈ పరిణామాలు చూసి మంత్రులు సైతం నివ్వెరపోతున్నారు. అయితే బాబుకు ఎవ్వరూ ఎదురు  చెప్పలేరు. 

అలాగే ఏపి ప్రభుత్వంలో ఉన్న సలహాదారులు కూడా మంత్రులతో సహా కూర్చుంటున్నారు. మామూలుగా అయితే ఈ సమావేశాలకి వారికి ప్రవేశం ఉండదు. వెనుకటికి వైయస్, రోశయ్య, కిరణ్ ప్రభుత్వంలో సలహాదారులు ఉన్నారు. కాని వారిని ఎవ్వరిని ఇలాంటి సమావేశాలకు రానిచ్చేవారు కాదు. మొత్తానికి వీళ్ళందరి జోక్యంతో కేబినెట్ మీటింగ్ నిర్వచనం మారిపోయింది.. ఈ కేబినెట్ కొనసాగుతున్న సమయం బాబు సుధీర్ఘ ప్రసంగాలు మంత్రులకు విసుగు తెప్పిస్తోంది. చివరికి కేబినెట్ మీటింగ్ అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇదీ సంగతి. 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -