Monday, May 6, 2024
- Advertisement -

వేల‌మంది అమ్మాయిల జీవితాల‌ను ముంచిన టెక్నాల‌జీ…

- Advertisement -

ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో కీలకపాత్ర వహిస్తోంది. మానవ జీవితంలో టెక్నాలజీ ఒక భాగంగా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా అంద‌రూ స్మార్ట్ ఫోన్ల‌తో టెక్నాల‌జీనీ ఉప‌యోగించుకుంటున్నారు. టెక్నాల‌జీని జాగ్ర‌త్త‌గా ఉప‌యోగించుకుంటే ఎంత లాభంలో ఉందో …అంతే న‌ష్టం కూడా ఉంది. టెక్నాల‌జీని చెడు మార్గాల‌కు ఉప‌యోగించుకోవ‌డం వ‌ల్ల కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి.

సాంకేతిక పరిజ్ఞానం యువతను ఎలా తప్పుదారి పట్టిస్తుందో చెప్పేందుకు ఉదాహ‌ర‌ణ‌గా…ఓ మైన‌ర్ బాలుడు చేసిన పైశాచిక‌త్వం హైద‌రాబాద్‌లో వెలుగులోకి వ‌చ్చింది. ఈ బుడ్డోడు చేసిన ప‌నికి వేల అమ్మాయిల జీవితాలు ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారాయి.

వివ‌రాల్లోకి వెల్తే…మాదాపూర్ లోని ఓ లేడిస్ హాస్టల్ పక్కనే బాలుడి కుటుంబం నివాసం ఉంటోంది. 8వ తరగతి చదువుతున్న మైన‌ర్ బాలుడు (12 ) పక్కనే హాస్టల్ లో అమ్మాయిలు స్నానం చేస్తుంటే కిటికీ దగ్గర కూర్చుని ట్యాబ్ తో వీడియోలు తీసేవాడు.

ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 3,000 వీడియోలు, ఫొటోలు అతని ట్యాబ్ లో లభ్యమయ్యాయి. అమ్మాయిలు బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా.. హాస్టల్ ప్రక్కనే ఉన్న బిల్డింగ్‌లో నుంచి బాలుడు ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అయితే వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో సెల్‌ఫోన్ ఫ్లాష్‌ లైట్ వెలగడంతో ఓ అమ్మాయి వీడియో రికార్డ్ చేస్తున్న విషయాన్ని గుర్తించింది. దీంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఆ బాలుడిపై యువతులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 16న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాలుడినుంచి ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అందులోని వీడియోలు చూసి విస్తుపోయారు. గత ఆరు నెలలుగా దాదాపు పలువురు యువతులకు సంబంధించిన 3,000 వీడియోలు, ఫొటోలను నిందితుడు తీసినట్లు గుర్తించిన అధికారులు, బాలుడిపై కేసు నమోదు చేశారు. వీడియోలను ఎవరికైనా పంపించాడా? తన వద్దే ఉంచుకున్నాడా? అనే విషయమై నిందితుడిని అధికారులు విచారిస్తున్నారు.

తల్లిదండ్రులే సెల్‌ఫోన్ కొనిచ్చిట్టుగా దర్యాప్తులో తేలింది. సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూడటం వల్ల బాలుడి ప్రవర్తనలో మార్పు వచ్చి.. ఇలా వికృత చేష్టలకు తెగబడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక నైనా త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు స్మార్ట్ ఫోన్‌లు ఇచ్చేట‌ప్పుడు జాగ్ర‌త్త‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -