- Advertisement -

ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి 5 జీ స్మార్ట్ …

- Advertisement -

ప్రపంచంలోనే తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది లెనోవోకు చెందిన మోటోరోలా సంస్థ. మోటో జెడ్3 పేరుతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. 5జీ మోటో మోడ్ ఉన్న ఈ ఫోన్‌ను షికాగోలో జరిగిన ఓ ఈవెంట్‌లో లాంచ్ చేశారు. ఈ ఫోన్ 5జీ నెట్ వర్క్ కి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం కంపెనీ 5జీ మోటో మోడ్‌ని కూడా ప్రకటించింది. 5జీ నెట్ వర్క్ సపోర్ట్ తో విడుదలవుతోన్న తొలిఫోన్ ఇదే కావడం విశేషం.

వినియోగదారులకు పలు ఆకట్టుకునే ఫీచర్లతో పాటు దీనిలో అధునాతన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌‌‌సెట్‌ ప్రాసెసర్ ని అమర్చారు. ఈ ఫోన్ ధర ఇండియాలో సుమారుగా రూ.33,000గా ఉండే అవకాశం ఉంది. నలుపు రంగులో లభ్యం అయ్యే ఈ ఫోన్ అమెరికాలో ఈనెల 16 నుండి విక్రయానికి అందుబాటులోకి రానుంది. అనంతరం భారత మార్కెట్లోకి రానుంది . 5జీ మోటో మోడ్ 2019 నుంచి అమెరికాలోకి అందుబాటులోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -