Thursday, March 28, 2024
- Advertisement -

మన నాయకులు కోసం రాత్రింబవళ్లు టాటా సంస్థ కష్టం..!

- Advertisement -

పార్లమెంటు కొత్త భవన శంకుస్థాపనకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రస్తుత భవనం చాలదన్న ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగంతస్తుల్లో భారీ రాజసౌధాన్ని నిర్మించడానికి సిద్ధమైంది.

గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్‌, ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ దీని ఆకృతులు రూపొందిస్తుండగా, టాటా సంస్థ నిర్మాణ పనులు చేపడుతోంది. డిసెంబరు రెండో వారంలో, కార్తీక మాసం ముగిసేలోగా శంకుస్థాపన జరగొచ్చని అధికారవర్గాలు భావిస్తున్నాయి.

టాటా సంస్థ ఇప్పటికే రాత్రింబవళ్లు పనిచేస్తూ ఇప్పుడున్న భవనం ప్రహరీ చుట్టూ బ్యారికేడ్లను నిర్మిస్తోంది. భద్రతతోపాటు, దుమ్మూధూళి బయటికి వెదజల్లకుండా ఏర్పాట్లు చేస్తోంది. నిర్మాణ స్థలంలో ప్రస్తుతం ఉన్న భారీ వృక్షాలను కూడా జాగ్రత్తగా పెకలించి వేరేచోట నాటడానికి తరలిస్తోంది. పనులను 2022 అక్టోబర్‌ నాటికి పూర్తిచేయాలన్నది లక్ష్యం.

Also Read

ఆచార్య సెట్స్‌లో సోనూ సూద్‌కి సత్కారం!

బుల్లితెరపై కూడా కన్నేసిన స్టార్ హీరోయిన్లు..!

చిట్టిబాబును పెళ్లి చేసుకుంటా..! : అనసూయ

జనసైనికులకు పవన్ ఏమని పిలుపు ఇచ్చారో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -