Friday, April 19, 2024
- Advertisement -

వైఎస్ వివేక‌నంద రెడ్డి హ‌త్య కేసులో కొత్త విష‌యాలు..!

- Advertisement -

వైఎస్ వివేక‌నంద రెడ్డి హ‌త్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. వైఎస్ వివేక హ‌త్యపై అధికార , ప్ర‌తిప‌క్ష పార్టీలు రెండు కూడా ఒక‌రిపై మ‌రోక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన హ‌త్య కావ‌డంతో అంద‌రు దీనిని రాజకీయ హ‌త్య‌గానే భావించారు. అయితే వివేక‌నంద హ‌త్య వెనుక పెద్ద కుట్రే దాగి ఉంద‌ని తెలుస్తోంది.

మొద‌ట ఈ హ‌త్య‌లో రాజ‌కీయ కోణం ఉండే అవ‌కాశం ఉంద‌ని ,ఆ దిశ‌గా పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దీంతో వివేక‌నంద రెడ్డి హ‌త్య కేసులో కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. వైఎస్ వివేక‌నంద రెడ్డి హ‌త్య వెనుక ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్ ఉంద‌ని బ‌య‌ట‌ప‌డింది. ఈ కేసు వెన‌క ఒక భూమి విష‌యంలో 150 కోట్ల సెటిల్‌మెంట్ వ్య‌వ‌హారంలో వ‌చ్చిన వివాద‌మే వివేకా హ‌త్య‌కు దారి తీసిందని పోలీసుల ద‌ర్యాప్తులో తెలింద‌ట‌. వేముల మండ‌లం దుగ్గ‌న్న ప‌ల్లెకు చెందిన ఓ వ్య‌క్తికి, వివేకానంద‌రెడ్డి ఆస్తుల‌కు సంబంధించి ప‌వ‌ర్ ఆఫ్ అటార్ణీ ఉన్న‌ట్లు సిట్ ద‌ర్యాప్తులో తేలింది.

వివేకా ఆస్తుల వ్య‌వ‌హారాలు అన్ని అత‌నే చూసుకుంటున్న‌ట్లు స‌మాచారం. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు వేంప‌ల్లి స‌బ్‌రిజిస్టార్ కార్యాల‌యంలో విచార‌ణ మొద‌లు పెట్టారు. వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణంతో ఆయ‌న పేరిట ఉన్న ప‌వ‌ర్ ఆఫ్ అటార్ణీ ర‌ద్దు అయిన‌ట్లేన‌ని స‌బ్‌రిజిస్టార్ కార్యాల‌యం తెలిపింది. ఓ ల్యాండ్‌కు సంబంధించిన చిన్న వివాద‌మే వివేక హ‌త్య కార‌ణం అయి ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిలో భాగంగానే అనుమానం ప్ర‌తి ఒక్క‌రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప‌రమేశ్వ‌ర‌రెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దీంతో వివేకానంద‌రెడ్డి హ్య‌త్య కేసు రోజుకో మ‌లుపుతిరుగుతుంద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -