Friday, April 19, 2024
- Advertisement -

థర్డ్​వేవ్​ వచ్చేస్తోందా? భయపెడుతున్న కొత్త వేరియంట్లు..!

- Advertisement -

కరోనా మొదటి వేవ్​ తర్వాత అంతా ఈ వ్యాధిని లైట్​ తీసుకున్నారు. విచ్చలవిడిగా తిరిగారు. పార్టీలు, వేడుకలు, టూర్లు అంటూ చక్కర్లు కొట్టారు. ఇక చాలామంది మాస్కులు పెట్టుకోవడం, భౌతికదూరం పాటించడం కూడా మరిచిపోయారు. దీంతో కరోనా సెకండ్​వేవ్​ ముంచుకొచ్చింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశవ్యాప్తంగా ఆక్సిజన్​ కొరత ఏర్పడింది. చాలా ఆస్పత్రుల్లో బెడ్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. ప్రభుత్వ లెక్కలు ఎలా ఉన్నా.. కరోనాతో మరణించిన వారి సంఖ్య గణనీయంగానే ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా థర్డ్​వేవ్​ ముప్పు విషయంలో నిపుణులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా లేకపోతే ముప్పు పొంచి ఉందని వార్నింగ్​ ఇస్తున్నారు. తాజాగా కొన్ని వేరియంట్లతో థర్డ్​వేవ్​ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ వేరియంట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. ల్యాంబ్డా వేరియంట్(Lambda Variant) థర్డ్​వేవ్​కు కారణమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికే 30 దేశాల్లో ఈ వేరియంట్ వెలుగు చూసింది. కెనడాలో 27 కేసుల్ని గుర్తించారు.

కోవిడ్ 19 కప్పా వేరియంట్(Kappa variant) కూడా మనదేశంలో అక్కడక్కడా కనిపిస్తున్నది. ఇది డెల్టా వేరియంట్​ లాంటిదేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే డెల్టా వేరియంట్​తో పోల్చినప్పుడు తీవ్రత తక్కువ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఇలా పలు వేరియంట్ల వల్ల థర్డ్​వేవ్​ ముప్పు పొంచి ఉందని వాదనలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -