Sunday, April 28, 2024
- Advertisement -

భార‌త్ విమానాల కూల్చివేత‌పై సంచ‌ల‌న ప్ర‌క‌టన చేసిన పాక్‌

- Advertisement -

త‌ప్పు చేయ‌డం….బుకాయించ‌డం త‌రువాత త‌ప్పును ఒప్పుకోవ‌డం పాక్ కు అల‌వాటుగా మారింది.పుల్వామా ఉగ్ర‌దాడి త‌ర్వాత బాలాకోట్ లో ఉన్న ఉగ్ర‌శిబిరాల‌పై భార‌త్ యుద్ధ‌విమానాలు దాడికి ప్ర‌తీకారంగా పాక్ ఐఏఎఫ్ చెందిన విమానాలను పీఏఎఫ్‌ కూల్చివేసింది. ఇందులో ఎప్ 16 యుద్ధ‌విమానాల‌ను ఉప‌యోగించ‌లేద‌ని ముందు బుకాయించిన పాక్ ఆమెరికానుంచి వ‌స్తున్న ఒత్తిడిని త‌ట్టుకోలేక నిజం ఒప్పుకుంది.తమ ఎఫ్-16 యుద్ధ విమానాలే భారత మిగ్ ను కూల్చేశాయని పాక్ సైన్యాధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ నిజాన్ని అంగీకరించారు.

ఫిబ్రవరి 27న ఎల్ఓసీ వెంబడి, తమ గగనతలం నుంచే దాడులు చేయాల్సి వచ్చిందని, తాము మోహరించిన విమానాల్లో ఎఫ్-16 విమానాలు కూడా ఉన్నాయని, భారత విమానాలు తమ భూభాగంలోకి ప్రవేశించిన తరువాత, రెండు విమానాలను కూల్చేశామని అన్నారు.ఆత్మరక్షణ కోసం ఏ విధంగానైనా స్పందించే హక్కు మాకుంది’ అని ఆయన ప్రకటించారు. మా వద్ద ఉన్న ఎఫ్‌–16 విమానాలను మాత్రం ఐఏఎఫ్‌ కూల్చలేదు’ అని కూడా ఆయన తెలిపారు. కానీ, గత నెలలో జేఎఫ్‌–17 రకం విమానాన్ని మాత్రమే వాడినట్లు గఫూరే ప్రకటించారు.

బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలపై ఐఏఎఫ్‌ దాడికి ప్రతీకారంగా పాక్‌ వైమానిక దళం కూడా దాడికి యత్నించిన విషయం తెలిసిందే. కానీ, ఈ సందర్భంగా అమెరికా తయారీ ఎఫ్‌–16ను ఐఏఎఫ్‌ కూల్చివేయడం కలకలం రేపింది.దీనికి సంబంధించిన ఆధారాల‌ను అమెరికాకు భార‌త్ అంద‌జేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఒత్తిడిని త‌ట్టుకోలేక పాక్ నిజం ఒప్పుకుంది. ఎఫ్-16 విమానాలను మూడో దేశంపై ఉపయోగించరాదని విక్రయ ఒప్పందంలో అమెరికా పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -