Monday, April 29, 2024
- Advertisement -

పాక్ కు షాక్ ఇచ్చిన ఇండియా మాజీ ప్రధాని మన్మమోహన్ సింగ్…

- Advertisement -

పాకిస్తాన్‌కు షాకిచ్చారు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. నవంబరులో సిక్కుల కల నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కర్తార్‌పూర్ కారిడార్ అందుబాటులోకి రాబోతోంది.నవంబరు 9న కర్తార్‌పూర్ కారిడార్‌ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదిని కాకుండా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆహ్వానం పలికింది.గురు నానక్ 550 జయంతి సందర్భంగా పాక్ ప్రభుత్వం, భారత్‌లో ఉన్న సిక్కు యాత్రికుల కోసం కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించబోతుంది.ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఖురేషి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. త్వరలోనే అధికారికంగా మన్మోహన్‌ను ఆహ్వానిస్తామని వెల్లడించారు.

పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ప్రకటించిన కొద్ది సేపటికే మన్మోహన్ దాన్ని తిరస్కరించనున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.ప్రభుత్వ స్థాయిలో అంతర్జాతీయ ఆహ్వానాలు అందినప్పుడు విదేశాంగశాఖ సలహా తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించినట్లు సమాచారం.

కర్తార్‌పూర్ కారిడార్ అనేది కార్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్ నుంచి పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లాలోని డేరాబాబా నానక్ ఆశ్రమం వరకు ఈ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. కర్తార్‌పూర్‌లోని గురుద్వారా సాహిబ్ వరకు పాక్ దీన్ని నిర్మిస్తుండగా, పంజాబ్‌లోని డేరా బాబా నానక్ నుంచి భారత్ నిర్మిస్తోంది. భారత్‌లో నుంచి వెళ్లే సిక్కు భక్తులు ఎటువంటి వీసా మతులు లేకుండానే అక్కడి వెళ్లే వీలుకల్పిస్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -