Friday, March 29, 2024
- Advertisement -

పార్లమెంట్ సభలకు వేళాయే.. సమావేశాలు ఎప్పుడంటే.!!

- Advertisement -

కరోనా కారణంగా దేశంలోని అన్ని కార్యకలాపాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. పరిపాలన కూడా స్తమిభించగా అందరి నాయకుల ఫోకస్ కరోనా ని అరికట్టడంపై ఉంది.. దాంతో ప్రభుత్వంలో జరగాల్సిన కొన్ని మీటింగ్స్ వగైరా వగైరా వాయిదా పడ్డాయి.. ఆ కోవలోనే పార్లమెంట్ సమావేశాలు సైతం జరగలేదు.. వాస్తవానికి పార్లమెంట్ సమావేశాలు జూన్ ,జులై లలో జరగాలి కానీ అప్పుడు కరోనా విజృంభణ దృష్ట్యా సమావేశాల ఏర్పాటు వీలుకాలేదు.. దాంతో సమావేశాలను వాయిదా వేశారు. అయితే రాజ్యాంగం ప్రకారం ప్రతి ఆరునెలలకోసారి ఈ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి దాంతో ఇప్పుడు తప్పక సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది..

అయితే వచ్చే నెలలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది పార్లమెంట్‌ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ. ఈనేపథ్యంలో వర్షాకాల సమావేశాల తేదీలు దాదాపు ఖరారయ్యాయి. సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు18 రోజుల పాటు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కాగా కరోనా ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఈ సమావేశాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది.. అందుకోసం ఉభయసభల్లో ప్రత్యేక ఏర్పాలు చేస్తున్నారు..భౌతిక దూరం పాటించేలా సీట్ల కేటాయింపు విషయంలో ఇప్పటికే కసరత్తులు మొదలయ్యాయి అని అంటున్నారు..

ఉభయ సభలలోనూ ఛాంబర్‌లు,గ్యాలరీలను సభ్యుల సీటింగ్‌కే కేటాయిస్తున్నారు.లోక్ సభ సభ్యలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో, రాజ్యసభ సభ్యులకు లోక్ సభ, రాజ్య సభలో సీట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. .రాజ్యసభ సభ్యులలో 60 మంది ఛాంబర్‌లో,మరో 51మంది గ్యాలరీలలో,మిగతా 132 మంది సభ్యులు లోక్‌సభలో కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.సభ్యులు సమావేశాలను వీక్షించేందుకు అనుగుణంగా ఆయా ప్రదేశాలలో భారీ తెరలను ఏర్పాటు చెయ్యనున్నారు.ఇప్పటికే పలువురి నేతలకు కరోనా రావడంతో ఈ వర్షాకాల సమావేశాల నిర్వహణపై కొంత ఆసక్తి నెలకొంది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -