Friday, May 10, 2024
- Advertisement -

పవన్ ని వదిలేసిన చంద్రబాబు?

- Advertisement -

ఎలక్షన్ సమయంలో జన సేన వ్యవస్థాపకుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ తెలుగు దేశం అధికారంలోకి రావడానికి ప్రముఖ వ్యక్తులలో ఒకరు. అలాంటిది ఇప్పుడు సమీకరణాలు మారుతున్నాయి. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసే రోజే ప్రత్యేక హోదా కోసం జన సేన కార్యకర్తలు విజయవాడలో నిరసన తెలపారు.

ఇలా చేయడం వెనుక ఏదైనా సంకేతం ఉందా.? రాజధాని కోసం చేస్తున్న భూమి పూజ వంటి కీలకమైన కార్యక్రమానికి బిజెపి నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ హాజరయ్యారు. కానీ జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమవుతోంది.. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాజధాని భూమి సమీకరణను వ్యతిరేకించలేదు, భూ సేకరణ చట్టం కింద భూములు తీసుకోవద్దని మాత్రమే అన్నారు.. కారణం ఏదైనా కావొచ్చు, కానీ ఇలాంటి కీలకమైన కార్యక్రమాలకు హాజరు కాకపోవడం పలు రకాల చర్చలకు దారి తీస్తోంది.

చంద్రబాబు పిలిచినా పవన్ వెళ్ళలేదా? లేక అసలు పవన్ ని పిలవలేదా? అన్నది తెలియాల్సి ఉంది.  ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఏపి ప్రభుత్వాన్ని కాని, చంద్రబాబును కాని పెద్దగా నిలదీయలేదు. మరి ఎందుకిలా జరిగిందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -