Friday, May 3, 2024
- Advertisement -

ప‌వ‌ణ్ పేప‌ర్ పులినా……?

- Advertisement -
Pawan Kalyan comments on farmers problems

రైతు సమస్యలపై ఎవరు పోరాడినా అభినందించి తీరాల్సిందే. రైతు సమస్యల పట్ల ఏ ప్రభుత్వం ఎంత సానుకూలంగా స్పందించినా అభినందించాలి.ఎందుకంటే, ఒక్క రైతుకు మాత్రమే తాను పండించిన పంటకు ధరను నిర్ణయించుకోలేని దుస్థితి దాపురించింది.

దీంతో రైతులు దిక్కుతోచ‌ని స్తితిలో అప్పులు ఎక్కవయ్యి ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఇది ఒక్క రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంమీద ఇలా జ‌రుగుతోంది.
మార్కెట్‌లో ఓ కొత్త ప్రోడక్ట్‌ ఏదయినా వచ్చిందంటే, దాని తయారీదారు ధర నిర్ణయించేస్తాడు. మరి, రైతు ఆరుకాలాలు క‌ష్ట‌ప‌డి పండించిన పంట‌కు మాత్రం ధ‌ర‌ను నిర్న‌యించుకోలేక పోతున్నారు. పది మందికి తిండి పెట్టడమే రైతన్నద‌గ్గ‌రి కొచ్చ‌టాల‌కు ప్ర‌భుత్వాలు చేతులెత్తే స్తున్నారు. ద‌లారులే రైత‌లును నిట్ట‌నిలువునా ముంచేస్తున్నార‌న్న‌ది ప్రభుత్వ పెద్ద‌ల‌కు తెలిసికూడా వారికే వెన్ను ద‌న్నుగా నిలుస్తున్నారు.
రైతు ప‌డుతున్న క‌ష్టాల మీద పత్రికా ప్రకటనలతోనే ఆ మాట్లాడటం సరిపెట్టెయ్యకూడదు. ప్ర‌త్య‌క్ష పోరాటానికిదిగినా ప్ర‌భుత్వం పట్టించుకోవ‌డంలేదు. అలాంటిది పేప‌ర్ ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌భుత్వాలు దిగివ‌స్తాయా.ప్ర‌శ్నించ‌డానికే పార్టీని పెట్టిన‌ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కి మాత్రం జనంలోకి వెళ్ళేందుకు తీరిక లేదు. అప్పుడ‌ప్పుడు మెరుపు తీగ లాగ ట్విట్ట‌ర్‌లోలో స్పందిస్తుంటారు., మ‌రి మ‌ల్లీ ఏదైనా స‌మ‌స్య వ‌స్తే త‌ప్ప స్పందించ‌రు ప‌వ‌ణ్ క‌ళ్యాన్‌. . కళాతపస్వి విశ్వనాథ్‌కి జాతీయ పురస్కారం దక్కితే, పరుగెత్తుకుంటూ వెళ్ళి అభినందించిన పవన్‌కళ్యాణ్‌, మిర్చి ధర పతనంతో రైతులు విలవిల్లాడుతోంటే ప్రకటన చేసి ఊరుకోవడాన్ని ఏమనుకోవాలి. అస‌లు ప‌వ‌ణ్ కు చిత్త‌శుద్ధి ఉందా ..

రైతులు ఆందోళనలు చేస్తోంటే, కొన్ని ప్రభుత్వాలు ఆ రైతుల్ని తీవ్రవాదుల్లా చూస్తున్నాయి. కేసులు పెట్టి, జైళ్ళకు పంపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనూ, పవన్‌లాంటి వ్యక్తులు ప్రకటనలతో సరిపెట్టడం అత్యంత హాస్యాస్పదం. క్వింటాల్‌ మిర్చికి 11 వేల చొప్పున రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలన్నది పవన్‌కళ్యాణ్‌ డిమాండ్‌. ఓ ప్రకటనలో ఈ డిమాండ్‌ చేసేస్తే ఏ ప్రభుత్వం దిగొస్తుందో పవన్‌కళ్యాణే సమాధానం చెప్పాలి. కేంద్రం వద్దకు వెళతారో, రాష్ట్ర ప్రభుత్వాల్ని నిలదీస్తారో.. జనసేన అధినేతగా జనంలోకి వెళ్ళాల్సిన బాధ్యత అయితే ఆయనకుంది. కానీ, ఏం చేస్తాం.. అప్పుడ‌ప్పుడూ సోషియ‌ల్ మీడియాలో,పేప‌ర్ లో ప్ర‌క‌ట‌న‌లు త‌ప్ప చేసేదేముంది. జనసేనాధిపతి జస్ట్‌ పేపర్‌ టైగర్ అని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.

Also Read

  1. పవన్ కి బాహుబలి 2 నచ్చలేదా..?
  2. పవన్ జనసేన పార్టీకి చరణ్ మద్దతు..?
  3. తెలంగాణాలో గ‌ద్ద‌ర్..పవన్ క‌ల‌సి పోటీ ఇది ఫిక్స్‌…
  4. జనసేన ప్రజ సమస్యతో ఓ అడుగు ముందుకేసిందా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -