Tuesday, May 7, 2024
- Advertisement -

కొత్త రాజకీయ శక్తిగా పవన్!

- Advertisement -

ఇటివలే CMS సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రజల అభిప్రాయాలు బయట పడ్డాయి. టీడీపి ప్రభుత్వం ఇంకా పుంజుకోవాలి.. చంద్రబాబు పని తీరు ఓకే కానీ ఫలితాలు కనబడడం లేదు.. ప్రజలు, ప్రబుత్వానికి మధ్య గ్యాప్ ఉంది… ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అనిశ్చితి ఉంది. ఏపీలో కొత్త రాజకీయ శక్తి అవర్బవించేందుకు అవకాశముందని సర్వేలో తేలింది.

అయితే ఆ రాజకీయ శక్తి మరో ఎవరో కాదు పవన్ కళ్యానే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఎలాగో 2019 లో బరిలో దిగుతున్నాడు. ఆయన సినిమాలు పక్కన పెట్టి.. సీరియస్ గా రంగంలో దిగితే ఫలితం దక్కే అవకాశాలు ఉన్నాయి. అలాగే పవన్ త్వరలోనే పూర్తి స్తాయి రాజీకీయాలలోకి రాబోయే ముందు, పవన్ బస్సు యాత్ర ద్వారా ప్రజల సమస్యల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈ వైపు ఏపిలో మొజారిటి భాగం ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి, ఫ్యాన్స్, యూత్ నుంచి అతడికి బలమైన అండ ఉంటుంది. దీంతో అతడు 2019 స్థానిక ఎన్నికల్లో కింగ్ మేకర్ అయిపోవచ్చు అంటున్నారు. ఇక బాబు విషయన్నికి వస్తే రెండేళ్ల పాలనపై సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ సర్వే నిర్వహించింది. మంత్రి వర్గం ప్రభుత్వం ఫథకాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాబుకు 67 శాతం మంది అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్నారు జనం.

అలాగే గతంలో కంటే… ఏపీలో అవినీతి పెరిగిందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సర్వేలో తేలింది. రెవెన్యూ, మీలీసు, విద్య, వైద్య రంగాల్లో అవినీతి పెరిగిందని 33 శాతం ప్రజలు తెలిపారు. కొత్త రాజకీయ శక్తి వచ్చేందుకు రాష్ట్రంలో అవకాశం ఉందన్నారు జనం. అభివృద్ధి కార్యక్రమాల అమలు ఏపీలో కంటే.. తెలంగాణాలో బాగా జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడ్డారు. పనితీరులో తెలంగాణకు 43 శాతం, ఏపికి 34 శాతం ప్రజల మెప్పు లభించింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -