Thursday, March 28, 2024
- Advertisement -

పవన్, టీడీపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయా..?!

- Advertisement -

అప్పుడెప్పుడో రాజధాని ప్రతిపాదిత ప్రాంతానికి వెళ్లొచ్చాడు పవన్ కల్యాణ్. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ భూముల సమీకరణ గురించి కానీ, సేకరణ గురించి కానీ మారు మాట్లాడలేదు.

కానీ ఇక భూ సమీకరణ అంతా అయిపోయింది.. ఇక సేకరణే అని ప్రభుత్వం ప్రకటించిన సమయంలో పవన్ ట్వీట్ల రాజకీయం మొదలు పెట్టాడు. ఈయన వెళ్లి రైతులను కలిసింది ఒక కాలంలో అయినా… ఇప్పుడు ఉన్నట్టుండి మాట్లాడటం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

అసలు ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అంశం గురించి చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కానీ పవన్ ఆ అంశం గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు ప్రశ్నించలేకపోతున్నాను అంటూ ఒక ట్వీటు పెట్టి ఊరుకొన్నాడు. అయితే ఉన్నట్టుండి ఏపీ రాజధాని ప్రతిపాదిత భూముల అంశం గురించి పవన్ ట్వీట్లు పెట్టేస్తున్నాడు. దానిపై తెలుగుదేశం వాళ్లు విరుచుకుపడుతున్నారు.. దానిపై పవన్ మళ్లీ కౌంటర్ ఇచ్చాడు. ఈ విధంగా వీళ్లిద్దరి మధ్య రచ్చ కొనసాగుతోంది.

అయితే ఇదంతా ఒక వ్యూహాత్మకమా.. టీడీపీ, పవన్ లు కలిసి ఒక డ్రామా ఆడుతున్నారా? అనే సందేహాలు కూడా  వ్యక్తమవుతున్నాయిప్పుడు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదారి పట్టించడానికి.. పవన్ కు జనాల్లో మైలేజీ ఇచ్చేందుకు ఇలాంటి రాజకీయం కొనసాగుతోందా? అనే అనుమానాలున్నాయి. ప్రత్యేక హోదా అంశం గురించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటి రాజకీయం కొనసాగుతుండవచ్చని అంటున్నారు విశ్లేషకులు. అందుకే పవన్ కు ఉన్నఫలంగా రాజధాని రైతులు గుర్తుకు వచ్చారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి లోగుట్టు ఏమిటో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -