Friday, May 10, 2024
- Advertisement -

పేటీఎమ్ ద్వారా రూ.500 కొట్టు… ఎవ‌రివైనా ఆధార్ వివ‌రాలు మీచేతుల్లో..

- Advertisement -

మి ఆధార్ వివ‌రాలు సుర‌క్ష‌తంగా ఉన్నాయ‌నుకుంటున్నారా…? అలా అనుకుంటే పొర‌పాటే…ఇప్ప‌టి వ‌ర‌కు ఆధార్ నంబర్లు, బయోమెట్రిక్ వివరాలు భద్రంగా ఉన్నాయని యూఐడీఏఐ గత నవంబర్లోనే స్పష్టం చేసింది. యూఐడీఏఐ చెబుతున్న దాంట్లో నిజంలేదని ‘ది ట్రిబ్యూన్’ నిరూపించింది.

పేటిఎం ద్వారా రూ. 500 చెల్లిస్తే చాలు పది నిమిషాల్లో ఆధార్ వివరాలు పొందొచ్చంటూ సంచలన వార్తను బయటపెట్టింది. డబ్బు కట్టగానే ఏజెంట్ ద్వారా లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ పొందుతామని, వాట్సాప్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు ఆధార్ వివరాలను లీక్ చేస్తున్న విషయాన్ని బయటపెట్టింది.

వాట్సాప్‌లో ఓ ఏజెంట్‌ను సంప్రదించగా పేటీఎం ద్వారా రూ. 500 చెల్లించాలని సూచించాడు. పది నిమిషాల తర్వాత ది ట్రిబ్యూన్ కరస్పాండెంట్‌కు ఓ గేట్‌వే‌ను యాక్సెస్ చేయడానికి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ అందాయి. దీనిలో ఆధార్ నంబర్‌ను నమోదు చేసి.. సదరు వ్యక్తి ఆధార్ నమోదు కోసం సమర్పించిన వివరాలన్నీ పొందే వీలుంది. ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేస్తే చాలు పేరు, అడ్రస్, పిన్ కోడ్, ఫొటో, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇలా.. ఆ వ్యక్తికి సంబంధించి పూర్తి సమాచారం మీ చేతుల్లో ఉంటుంది.

సదరు న్యూస్ ఏజెన్సీ మరో రూ. 300 చెల్లించి.. ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే కార్డ్‌ను ప్రింట్ చేసే సాఫ్ట్‌వేర్‌ను యాక్సెస్ చేసింది. దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అంశం కావడంతో ఛండీగఢ్‌కు చెందిన యూఐడీఏఐ అధికారులు ఈ విషయం తెలుసుకొని కంగుతిన్నారు. వెంటనే బెంగళూరులోని యూఐడీఏఐ టెక్నికల్ కన్సలెంటెంట్లకు సమాచారం అందించారు. పేటీఎం ద్వారా డబ్బులు పొందగానే టీమ్ వ్యూయర్ ద్వారా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మ‌రి కేంద్ర ప్ర‌భుత్వం, యూఐడీఏఐ చెబుతున్న‌దంతా డొల్ల‌త‌నంగా క‌నిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -