తెలంగాణలో కరోనా రక్కసి.. కొత్తగా 2,478 పాజిటీవ్ కేసులు!

- Advertisement -

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల వరుసగా రోజు వారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి తెలంగాణలో అనూహ్యంగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.  గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,478 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది.

ఒక్క‌రోజులో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 363 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 15,472 క్రియాశీల కేసులున్నాయని, 9,674 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

- Advertisement -

తాజాగా నమోదైన కేసుల్లో 402 హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి.  ఇప్పటి వరకు 3.03లక్షల మంది కోలుకున్నారు. మరో 1,746 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

థియేటర్లో ‘వకీల్ సాబ్’.. ఫ్యాన్స్ పూనకాలు..

‘అన్నాత్తే’ కోసం మళ్లీ హైదరాాబాద్ కి వచ్చిన రజినీకాంత్

నేటి పంచాంగం, శుక్రవారం (9-4-2021)

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -