ఆ మధ్య అన్నా హజారే ఉద్యమ సమయంలో అభినవ ఆంధ్రా హజారే అనే స్థాయిలో బిల్డప్పులిచ్చి పచ్చ మీడియాలో గొప్పగా ప్రచారం చేయించుకున్నాడు చంద్రబాబు. ఇక ఇప్పుడు అక్క, చెల్లెల్ల కోసం పుట్టుకొచ్చిన కల్కి భగవానుడి అవతారాన్ని అన్న రేంజ్‌లో పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నాడు. రాష్ట్రంలో ఇంకొక్క అత్యాచార ఘటన కూడా జరగకూడదు, మహిళలపై దాడిచేస్తే ఉరిశిక్షే అనేస్థాయిలో బాబు బిల్డప్ మాటలు చెప్తూనే ఉన్నాడు. కానీ ఈ మూడు నాలుగు రోజుల్లోనే ప్రతి రోజూ ఆంధ్రప్రదేశ్‌లో పదికి పైనే ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచార ఘటన అదే గుంటూరులో తాజాగా ఏడేళ్ళ బాలికపై అత్యాచారం జరిగింది. కానీ బాబు మాత్రం తన పబ్లిసిటీ స్టంట్స్‌లో తాను బిజీ.
అసలు బాబు ఎంత మొనగాడో……ఏ స్థాయిలో మహిళల కోసం పాటుపడతాడా తాజాగా ఆ మధ్య చనిపోయిన హీరోయిన్ ప్రత్యూష తల్లి చెప్పుకొచ్చింది. పరిటాల రవి నిర్మించిన శ్రీరాములయ్యలాంటి సినిమాలతో పాటు కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసి ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకున్న ప్రత్యూషపై అప్పట్లో చంద్రబాబు సన్నిహితులే అత్యాచారం చేసి, హత్య చేశారు. ఇక ఆ తర్వాత నుంచీ న్యాయం కోసం ప్రత్యూష తల్లి అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు చుట్టూ తిరిగారు. ప్రత్యూషపై అత్యాచారం, హత్య జరిగిందని నిరూపించే సాక్ష్యాధారాలను ఎంతో నమ్మి స్వయంగా చంద్రబాబు చేతికి ఇచ్చారు ప్రత్యూష తల్లి సరోజినీదేవి. అయితే చంద్రబాబు మాత్రం ఎంచక్కా ఆ సాక్ష్యాధారాలను తారుమారుచేసి కేసును నీరుగార్చారు. తాజాగా ఇవే విషయాలు చెప్పుకొచ్చిన సరోజినీ దేవి…….చంద్రబాబు హయాంలో మహిళలకు రక్షణ అనే మాటే ఉండదని….మహిళెవరూ బాబు మాటలు అస్సలు నమ్మొద్దని చెప్తూ బాబు వళ్ళే తన బిడ్డ అన్యాయమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
