Friday, April 19, 2024
- Advertisement -

రాష్ట్రపతి ఎన్నిక నేడే.. గెలిచేదెవ్వరు ?

- Advertisement -

దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్దమైంది. నేడు అనగా జులై 18న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసన సభ లలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈసారి రాష్ట్రపతి ఎన్నికల రేస్ లో ఎన్డీయే తరుపున గిరిజన మహిళా ద్రౌపది ముర్ము మరియు విపక్షాల తరుపున యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అభ్యర్థులు గా పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో 4 వేల 809 మంది ఓటర్లు పాల్గొననున్నారు. ఇందులో 776 మంది ఎం‌పిలు కాగా, 4 వేల 33 మంది ఎమ్మెల్యే లు ఓటింగ్ లో పాల్గొని రాష్ట్రపతిని ఎన్నుకొనున్నారు. ఈ వి ఏం ఓటింగ్ విధానంపై వివాదాలు కొనసాగే అవకాశం ఉన్నందున ఈ ఎన్నికల్లో సీక్రెట్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. .

ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటి సరిగా ఒక గిరిజన మహిళా రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల రేస్ లో ఉంది. ఎన్డీయే కూటమి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను ప్రకటించడం వెనుక కారణాలు ఏవైనప్పటికి.. దేశ వ్యాప్తంగా ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆమెకు 61 శాతం అన్నీ పార్టీల నుంచి మద్దతు లభించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమే అని.. ఎన్నికలు నామమాత్రమే అనే వార్తలు వస్తున్నాయి. ఇక విపక్షాల తరుపున యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నప్పటికి ఆయన నామమాత్రంగానే పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జూలై 21 న పార్లమెంట్ లో ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. ఎన్నికైన అభ్యర్థి జూలై 25 న భారత దేశానికి 16వ రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపడతారు.

ఇవి కూడా చదవండి

మోడీజీ ..సరికొత్త డిక్షనరీ !

ఫ్రీడం ఫైటర్స్ ను తీడితే పబ్లిసిటీ పెరుగుతుందా ?

ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదు ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -