Monday, April 29, 2024
- Advertisement -

సంధ్యా టెక్నో 1లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిన బాధితులు

- Advertisement -

సంధ్యా టెక్నో 1లో పెట్టుబడులు పెట్టి తాము తీవ్రంగా నష్టపోయిన బాధితులమేనని, తాము ఎవరిని బెదిరించి ఇక్కడి నుండి వెల్లగొట్టలేదని స్పష్టం చేశారు. మలికిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి సంబంధించిన ప్రతినిధులు తమపై చేసిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. 2021లో సంధ్యా టెక్నో 1లో పెట్టుబడులు పెట్టామని, తాము డెవలపర్స్ కాదని, భారీగా డబ్బులు చెల్లించినా నేటికీ నిర్మాణం పూర్తి చేయకుండా, తమకు ఆక్యుపెన్సీ ఇవ్వకుండా ఎస్ హెచ్ పీఎల్ సంస్థ ఇన్నాళ్లు కాలయాపన చేస్తూ వచ్చిందని తెలిపారు. డబ్బులు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా ఆక్యుపెన్సీ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఆలస్యం చేయడంతో తామే ముందుకు వచ్చి నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు.

సంధ్యా టెక్నో వన్ లో మొత్తం 130 మంది పెట్టుబడులు పెట్టగా ప్రస్తుతం 84 మంది ముందుకు వచ్చి పనులు చేయించుకుంటున్నామని, ఇప్పటి వరకు దాదాపు 75శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎస్ హెచ్ పీఎల్ ప్రతినిధులు కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా నిర్మాణాలు చేపట్టి మధ్యలోనే నిలిపివేశారని, ఓ ప్రైవేట్ కంపెనీకి డెవలప్మెంట్ ఇచ్చారని, ఇందులో మాకు సంబంధం లేదని వెల్లడించారు. 84 మందిమి కలిసి అభివృద్ధి చేసుకునే క్రమంలో ఎవరెవరో వచ్చి ఈ ఫ్లోర్ మాది, ఆ ఫ్లోర్ మాది అంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఎవరు అసలు, ఎవరు నకిలీ వారో తెలియక సంధ్యా టెక్నో వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నిస్తే విష్ణు వర్ధన్ రెడ్డి తమను రానివ్వడం లేదంటూ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి నష్ట పోలేమని, తాము కొన్న ఫ్లోర్ లలో తాము అభివృద్ధి చేస్కుంటున్నామని, జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు పనులు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంధ్యా టెక్నో 1లో పెట్టుబడులు పెట్టిన బాధితులు హరీష్ నాయిని, నిరంజన్, వెంకట్ రెడ్డి, మనోజ్, కృష్ణంరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -