Friday, April 19, 2024
- Advertisement -

అందరికీ షాక్.. రైతు ఇంట్లో అమిత్ షా భోజనం..!

- Advertisement -

కేంద్ర హోం మంత్రి అమిత్ షా బంగాల్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో ఉన్న అమిత్‌ షా.. ఉత్తర కోల్‌కతాలోని రామకృష్ణ ఆశ్రమాన్ని సందర్శించి.. స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు కుదిరాం బోస్‌ గృహాన్ని సందర్శించారు. అక్కడి నుంచి నేరుగా సిద్ధేశ్వరి కాళీ ఆలయానికి చేరుకున్న అమిత్‌ షా.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఆదివారం.. శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని సందర్శించి.. బోల్‌ పుర్ రోడ్ షోలో పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో బెంగాల్‌ వ్యవహారాలపై సమీక్షించేందుకే. షా వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా.. చేరికలే ప్రధాన లక్ష్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే.. సువేందు అధికారి అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరుతారని తెలుస్తోంది. ఆయనతోపాటు శిలభద్ర దత్తా, జితేంద్ర తివారీ, మరికొంత మంది ఎమ్మెల్యేలు, అసంతృప్త టీఎంసీ నాయకులు కమలదళంలో చేరతారని రాజకీయ వర్గాలు తెలిపాయి.

బంగాల్​ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి అమిత్​ షా.. మిడ్నాపుర్​ జిల్లాలోని బెలిజురి గ్రామంలో ఉన్న ఓ రైతు ఇంట్లో భోజనం చేశారు. ఆయన వెంటే బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​, కైలాశ్​ విజయ్​వర్గియా కూడా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -