Friday, April 26, 2024
- Advertisement -

స్నేహలత హత్య విషయంలో వెలుగు చూసిన కొత్త కోణం?

- Advertisement -

దేశంలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళలు మాత్రమే కాదు చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. ఏపిలో ధర్మవరంలో శవమై తేలిన అనంతపురానికి చెందిన స్నేహలత మర్డర్ కేసులో అనేక కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. డిగ్రీ తర్వాత కుటుంబ పోషన కోసం స్నేహలత ఉద్యోగంలో చేరింది. మొదటి నుంచి చదువులో చురుకుగా ఉన్న ఈమె క్రీడల్లో కూడా మంచి నైపుణ్యం సంపాదించింది.

హాకీ క్రీడలో మంచి నైపుణ్యం సంపాదించడం కోసం.. అనంతపురం ఆర్డీటీ స్పోర్ట్స్ అకాడమీలో హాకీ నేర్చుకుంది. హాకీ ఆటలో ప్రతిభ కనబర్చి, ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. తన కుటుంబ పోషణ కోసం రెండు వారాల క్రితమే ఎస్బీఐ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా చేరింది. ఈ నేపథ్యంలోనే అన్యాయంగా హత్యకు గురైంది. తమ కూతురు హత్యకు కారణం  రాజేష్‌ యువకుడు అన్న అనుమానంతో అతన్ని నిలదీశారు కుటుంబ సభ్యులు. కానీ అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దాంతో ఒకటో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరుసటి రోజు ఉదయం.. ధర్మవరం సమీపంలోని బడన్నపల్లి పొలం వద్ద ఓ యువతి మృతదేహం సగం కాలి పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. మృతురాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధర్మవరం బ్రాంచిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి స్నేహలత అని ఘటనాస్థలంలో దొరికిన ఐడీ కార్డు ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన వెనుక ఏం జరిగిందనేది జిల్లా ఎస్పీ వివరించారు. రాజేష్ గత 4 సంవత్సరాల నుంచి అంటే స్నేహ లత మైనర్ గా ఉన్నప్పటి నుంచీ గుత్తి రాజేష్ ప్రేమ పేరుతో వెంట పడేవాడు. స్నేహలతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక వాంఛ కూడా తీర్చుకునేవాడు.

ఈ క్రమంలో ఆమె ఎస్పీఐలో ఉద్యోగం చేయడంతో వారి మద్య విభేదాలు చోటు చేసుకున్నాయి. డిశంబర్ 22 న అమ్మాయి ఫోన్ చేసి తనను ధర్మవరం నుండి అనంతపురంనకు ఎక్కించుకెళ్లాలని చెప్పింది. తెగిపోయిన ఈ సంబంధం మళ్లీ ఇలా కలిసింది. ఆమెను పొలంలోకి తీసుకు వెళ్లి మరోసారి కామవాంఛ తీర్చుకొని ఉద్యోగం విషయంలో మరోసారి గొడవ పెట్టుకున్నాడు. మాట మాట పెరిగి ఆమెను గొంతు నులిమి చంపి ఆనవాళ్లు లేకుండా చేయడానికి ఆమె చున్నీ, కాగితాలతో పొట్ట భాగంపై కాల్చాడు. గుత్తి రాజేష్ స్నేహితుడైన సాకే కార్తీక్ ప్రోద్భలం కూడా ఇందులో ఉంది. ధర్మవరం నుండి స్నేహలతను నేర స్థలం వరకు ఎక్కించుకొచ్చిన అపాచీ వాహనాన్ని, ప్రధాన నిందితుడు వినియోగించిన 4 సెల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు. అయితే ఘటన జరిగిన 24గంటల లోపే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అంతే కాదు మైనర్ గా ఉన్నప్పటి నుండి మోసగించి శారీరకంగా కలసినందుకు ఫోక్సో చట్టం కింద 4 & 6, మరియు 376 IPC సెక్షన్లు యాడ్ చేసి అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -