Monday, May 6, 2024
- Advertisement -

ఏలూరు సబ్ జైలుకు చింతమనేని తరలింపు..ఈనెల 25 వరకు రిమాండ్

- Advertisement -

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా అజ్ణాతంలో ఉన్న చింతమనేనిని ఈ రోజు ఆయనను ఇంటి దగ్గర పోలీసుల అరెస్ట్ చేశారు. ఆయన భార్య అనారోగ్యం కారణంగా చింతమనేని అజ్ఞాతం వీడారు. అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది.

ఈ క్రమంలో దుగ్గిరాలలోని ఆయన ఇంటి వద్దకు అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.కారులో ఉన్న చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా, ఆయన ప్రతిఘటించారు. దీంతో స్వయంగా డీఎస్పీ రంగంలోకి దిగి ఆయన్ను అరెస్ట్ చేశారు. డీఎస్పీ, మరికొందరు పోలీసులు కలసి చింతమనేనిని లాక్కెళ్లి పోలీసు వాహనంలో కూర్చోబెట్టారు.చింతమనేని ప్రభాకర్ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరో 10 కేసులు కూడా నమోదయ్యాయి.

అనంతరం చింతమనేనిని ఏలూరులోని ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు చింతమనేనిని ఏలూరు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ నెల 25 వరకూ ఆయన రిమాండ్ లో వుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -