లేటెస్ట్ అప్డేట్: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా వైరస్

- Advertisement -

దేశంలో కరోనా కట్టడికి కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. 21రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో కరోనాపై సీరియస్ ఫోకస్ పెట్టిన సర్కార్ తొలుత పాజిటివ్ కేసులు పెరగకుండా తగు చర్యలు చేపట్టింది. అయితే రెండ్రోరోజులుగా తెలంగాణలోనూ భారీగా కరోనా కేసులు పెరిగిపోవడంతో ఆందోళనలు నెలకొన్నాయి.

తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 30పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు కరోనాతో మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. కరోనా పాజిటివ్ కేసులు 127కు చేరుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడించారు. ఢిల్లీ మర్కజ్ కు కరోనా లింకు ఉండటంతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. దీంతో తెలంగాణ నుంచి ఢిల్లీ మర్కజ్ వెళ్లిన వారి వివరాలను సేకరించి వారిని కరోనా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 500మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

వీరిలో 30మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మిగతా వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించినట్లు సమాచారం. ఢిల్లీకి వెళ్లొచ్చిన 1030మందిలో 160మంది వివరాలను ఇంకా తెలియాల్సి ఉంది. వీరి నుంచి దాదాపు 2వేల మంది వరకు కరోనా వ్యాపించి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నారు. అయితే ప్రభుత్వం అన్నివిధలా వారి గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక టీములు వారిని వెతికే పనిలో పడ్డాయి. త్వరలోనే వీరిని పట్టుకొని కరోనా ఆసుపత్రుల్లో చేర్చడం జరుగుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మరి కట్టడికి సహకరించాలని సర్కార్ విజ్ఞప్తి చేస్తుంది.

Most Popular

ఎమ్మెల్యే కొడుకులు వర్సెస్ యువనాయకుడు… ఎక్కడో తెలుసా..?

వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు, కోరుకోవడమే కాకుండా ఆయన్ను సీఎం చేయడానికి ఎవరి పాత్ర వారు పోషించారు. పార్టీ లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు...

మూడు రోజుల ముందే లీకైనా మోనాల్ ఎలిమినేషన్..!

తెలుగు లో విజయవంతంగా కొనసాగుతున అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోని ప్రస్తుతం 4వ సీజన్ జరుగుతుంది. ప్రతి వారం ఎలిమినేషన్ పక్రియాలో బాగంగా...

10 ఏళ్ళ తర్వాత మహేష్ తో అనుష్క రొమాన్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ తో సూపర్ హిట్ కొట్టి సంక్రాంతి రేసులో తనకంటూ ఓ రేంజ్ ఉందని తెలియజేశాడు. అనిల్ రావిపూడి లాంటి చిన్న డైరెక్టర్ తో ఇంత...

Related Articles

మృత్యు పోరులో ఓడిన మాజీ ముఖ్యమంత్రి..!

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్​ గొగొయి కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ… గువాహటి ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. తరుణ్​ గొగొయి(84) ఆగస్టు 25న కరోనా బారినపడ్డారు. వైరస్​ నుంచి కోలుకున్న...

కరోనాతో ఒడిశా ప్రథమ మహిళ మృతి..!

ఒడిశా గవర్నర్​ గణేశీ లాల్​ భార్య సుశీలా దేవి కరోనా బారిన పడి మృతి చెందారు. నవంబర్​ 1న గవర్నర్​ కటుంబ సభ్యులకు సోకగా భువనేశ్వర్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు....

జీ-20లో కరోనా పోరులో కొత్త మార్గాలు..!

జీ-20 సదస్సులో.. కరోనా నుంచి ప్రజల ప్రాణాలను రక్షించడం, మహమ్మారి వల్ల పతనమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, ఉత్తమ భవిష్యత్తుకు పునాది వేయడం అనే అంశాలపై చర్చించారు ఆయా దేశాధినేతలు. వర్చువల్​గా జరిగిన...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...