Friday, April 26, 2024
- Advertisement -

తెలంగాణలోకి ప్రవేశించిన ఒమైక్రాన్‌

- Advertisement -

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్ ఇప్పుడు తెలంగాణలోకి ప్రవేవించింది. విదేశాలనుంచి వచ్చిన ఇద్దరికి ఒమైక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇంతకీ వారిద్దరు ఎవ్వరు వాళ్లు ఏ దేశం నుంచి వచ్చారు. వారు ఎవ్వరెవ్వరితో టచ్‌లో ఉన్నారు అనేది అంతుచిక్కడం లేదు.

కరోనా కొత్త రకం వేరియంట్‌ ఒమైక్రాన్‌ వైరస్‌ తెలంగాణకు సైతం వచ్చింది. కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చిన వారికి ఈ వైరస్‌ సోకినట్లు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. వీరు హైదరాబాద్‌లోని మొహిదీపట్నం, టౌలీచౌకీకి చెందిన వారిగి గుర్తించారు. కెన్యా నుంచి వచ్చిన వ్యక్తి తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని తండ్రీకొడుకులిద్దరూ పలు ఆస్పత్రుల్లో తిరిగినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఒమైక్రాన్‌ సోకిన వ్యక్తిని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు.. అతనితో తిరిగిన వారి బ్లెడ్‌ శాంపిల్స్‌లను పూనే ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు.

మరోవైపు టౌలిచౌకీకి చెందిన మహిళకు ఒమైక్రాన్‌ సోకగా.. తనను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఐతే ఆస్పత్రి నుంచి ఆ మహిళ తప్పించుకుని పారిపోయిందని రోగి కోసం గాలించిన పోలీసులు.. మహిళను జూబ్లీహిల్స్‌లో పట్టుకొని కిమ్స్‌ ఆస్పత్రిలో జాయన్‌ చేసినట్లు తెలిపారు. వీరి వయస్సు 25లోపే ఉందని హెల్త్ డెరెక్టర్‌ తెలిపారు. వీరితోపాటు అబుదాబీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన 7 ఏళ్ల బాలుడికి ఒమైక్రాన్‌ సోకినట్లు తెలిపారు. ఆ బాలుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా తెలిపారు. బాలుడికి టెస్టులు చేసిన అధికారులు వాటి రిజల్ట్స్ వచ్చె సరికి ఆ బాలుడు వేరే ఫ్లైట్‌లో వెస్ట్‌ బెంగాల్‌ వెళ్లినట్లు తెలంగాణ ఆరోగ్య శాక ప్రకటించింది.

ఒమైక్రాన్‌ టీకాలు లభించేనా ?

ఏపీలో మళ్లీ త్రిమూర్తులు రాబోతున్నారా ?

కేసీఆర్‌ వద్ద డబ్బులు తీసుకున్నారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -