Thursday, May 9, 2024
- Advertisement -

ప్ర‌ధాని మోదీ, ఇవాంకా ఇత‌ర కేంద్ర మంత్రుల‌కు ఇవ్వాల్సిన బహుమతులను ఖరారు చేసిన కేసీఆర్

- Advertisement -

గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు హైద‌రాబాద్ వేదిక అయ్యింది. ఈ స‌ద‌స్సుకు ముఖ్య అథిదిగా హాజరు కానున్న వైట్ హౌస్ సలహాదారు, డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ఇప్ప‌టికె న‌గ‌రం చేరుకున్నారు. ఇవాంకాకు, ప్రధాని నరేంద్ర మోదీకి, సదస్సుకు హాజరయ్యే ఇతర కేంద్ర మంత్రులకు ఘనమైన బహుమతుల‌ను ఇచ్చేందుకు ప్ర‌భుత్వం సిద్దం చేసింది.

ఇవాంకాకు ,మోదీ, ఇత‌ర కేంద్ర‌మంత్రుల‌కు ఘ‌న‌మైన బ‌హామ‌తులు ఇచ్చి సత్కరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇవాంకాకు చార్మినార్ నమూనాను, ప్రధానికి కాకతీయ కళాతోరణం నమూనాను రాష్ట్ర గుర్తింపుగా ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఇవాంకకు ప్రత్యేకంగా గొల్లభామ చీరతో పాటు, ముత్యాలు, గాజులను కూడా బహుమతులుగా అందించాలని భావిస్తున్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు వీణ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కు నెమలి ప్రతిమలను ఇచ్చి సత్కరించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బహుమతులను ఇవ్వనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -