Saturday, April 27, 2024
- Advertisement -

నేటి నుంచే తెలంగాణ కుంభమేళా.. మేడారం జాతర ప్రారంభం

- Advertisement -

నేటి (ఫిబ్రవరి 16) నుంచి తెలంగాణలోని అతి పెద్ద గిరిజన సంప్రదాయ వేడుక అయిన సమ్మక్క సారలక్కల జాతర ప్రారంభంకానుంది. మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఈ వేడుకకు కోటి న్నరకు పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది.

ఈనెల 18 వ తేదీన సీఎం కె. చంద్రశేఖర రావు అమ్మవార్లను దర్శించుకోనున్నారు. జాతరలో మొదటి వేడుక అయిన పగిడిద్ద రాజును వేదిక మీదకు తీసువచ్చారు. నేడు సారలమ్మ, గోవిందరాజులు గద్దెల మీదకు చేరుకుంటారు. గోవిందరాజులను కూడా గద్దెమీదకు తీసుకురావడంతో తొలి రోజు వేడుక పూర్తవుతుంది.

జాతరలోముఖ్య ఘట్టం రేపు (17న) సమ్మక్క, సారలమ్మలు గద్దెమీదకు చేరుకుంటారు. ఈ కమనీయ వేడుకను చూసేందుకు భక్తులు పోటీ పడతారు. ముఖ్యంగా మహిళలు మంగళహారతులతో వన దేవతలకు స్వాగతం పలుకుతారు. 18న సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు,గోవిందరాజు, జంపన్నలు ఒకే సారి గద్దెలపై దర్శనమిస్తారు. అనంతరం 19 వ తేదీన దేవతల వనంలోకి తిరిగి చేరుకుంటారు. దీంతో జాతర వేడుక అధికారికంగా ముగుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -