Monday, May 6, 2024
- Advertisement -

ఎర్ర సూరీడు అస్త‌మ‌యం…

- Advertisement -

కొద్ది రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్‌లో చేరిన ప్రముఖ నటుడు, రెడ్ స్టార్, నిర్మాత మాదాల రంగారావు(69) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం తెల్లవారుజామున ఎర్ర‌సూరీడు అస్త‌మించాడు.

ప్రకాశం జిల్లా మైనం పాడులో 1948 మే 25న జన్మించిన ఈయన తన భావాలకు అనుగుణంగా సినిమాలను నిర్మించారు. ‘చైర్మన్ చలమయ్య’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు మాదాల రంగారావు. ఆ తరువాత నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, తొలిసారిగా ‘యువతరం కదిలింది’ చిత్రాన్ని తీసి మొదటిసారిగా బంగారునంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సంస్థలో.. ఎర్ర మల్లెలు, మహాప్రస్థానం, ప్రజాశక్తి, విప్లవ శంఖం, స్వరా​జ్యం, తొలిపొద్దు, ప్రజాశక్తి, ఎర్రసూర్యుడు లాంటి విప్లవ సినిమాలనే నిర్మించారు. తన సినీ జీవితాన్ని తాను నమ్మిన సిద్ధాంతానికే అంకితం చేశారు. వామపక్ష భావాజాలానికి అనుగుణంగానే సినిమాలను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించేవారు.

మే 19 అర్థరాత్రి హాస్పిటల్‌లో చేరిన ఆయన వెంటిలేటర్ సహాయంతోనే శ్వాసను తీసుకుంటున్నట్టు నాలుగు రోజుల కిందట రంగారావు కుమారుడు వెల్లడించారు. మూత్రపిండాల పనితీరు మందగించడంతో ఆయనకు డయాలసిస్ నిర్వహించి, లైఫ్ సేవింగ్ మెషీన్ సాయంతో కాపాడేందుకు ప్రయత్నించారు. కిడ్నీలు చెడిపోవడం, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, శరీరంలోని పలు అవయవాల పనితీరు మందగించడంతో వైద్యుల ప్రయత్నం ఫలించలేదు.

గతేడాది మే నెలలో తీవ్ర గుండెపోటుకు గురవడంతో స్టార్ హాస్పిటల్‌లోనే బైపాస్ సర్జరీ నిర్వహించారు. అంతకుముందు కూడా ఓ సారి కూడా ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది. అవినీతి, అణచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించారు. రాజకీయ, సామాజిక రంగాల్లోని ఎన్నో లోపాలను ఎత్తిచూపుతూ చిత్రాలను రూపొందించారు.

ప్రస్తుత తరానికి ఆర్‌. నారాయణమూర్తి గురించి మాత్రమే తెలుసు. కానీ 80,90ల్లోనే విప్లవ సినిమాలకు నాంది పలికిన యోధుడు రంగారావు. కమ్యూనిస్టు పార్టీతో సాన్నిహిత్యంగా మెలిగేవారు. ప్రజానాట్య మండలిలో క్రియాశీల సభ్యుడిగానూ వ్యవహరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -