Friday, April 26, 2024
- Advertisement -

ఇది నిజంగా మహా అద్భుతం.. చచ్చి బతికాడు!

- Advertisement -

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన 2.0 చిత్రంలో చిట్టి ద రోబో మళ్లీ రూపొందించిన తర్వాత ‘చచ్చి బతికి రావడంలో సుఖమే వేరు’ డైలాగ్ విని థియేటర్లో విజిల్స్, చప్పట్లతో మారు మోగింది. ఇప్పుడు నిజంగా అలాంటి అలాంటిదే జరగడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన సదరు మైఖేల్‌ నాపిన్క్సికి కాలినడకన దేశం చుట్టిరావడం అలవాటు. 45 ఏళ్ల వయసున్న ఆయన తన స్నేహితుడితో కలిసి అమెరికాలోని మౌంట్‌ రైనర్‌ నేషనల్‌ పార్క్‌లోని మంచుకొండపై పర్యటనకు వెళ్లాడు. కానీ అనుకోని కారణాల వల్ల అక్కడ ఇద్దరూ విడిపోయి చేలా ఓ దారిన వెళ్లారు.

నాపిన్క్సి ఓ చోట మంచులో కూరుకుపోయాడు.. అక్కడ నుంచి ఎంత అరచినా తన అరుపులు ఎవరికీ వినిపించలేదు. అయితే టైముకు వస్తానన్న నాపిన్క్సి రాకపోయేసరికి అతని స్నేహితుడికి అనుమానం వచ్చింది. అమెరికా కాబట్టి రెస్క్యూ టీమ్‌ వెంటనే వచ్చేసింది.. హెలికాఫ్టర్‌ వేసుకుని వెతకడం మొదలుపెట్టింది.. మొత్తానికి అతని ఆచూకి కనుగొని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.

దాంతో అందరూ కన్నీరు పెట్టుకున్నారు.. కాకపోతే నాపిన్క్సి పల్స్ కొట్టుకోవడం అతన్ని రక్షించవొచ్చని ఆశ కలిగింది. వెంటనే డాక్టర్లు సీపీఆర్‌ చేశారు..మొత్తానికి 45 నిమిషాలు చికిత్స అందించిన తర్వాత అతడి గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది. అదండీ సంగతి మొత్తానికి మనోడు చచ్చి బతికి అందరినీ ఆనందపరిచాడు.

మొదటి సారి బైడెన్ విమర్శలు..!

మన మాజీ ప్రధాని పై ఒబామా రాతలు..!

ట్రంప్- బైడెన్ ఒకే దాటి పై కీలక స్పందన..!

ఓరి ద్యావుడా.. పావురం ధర రూ. 14కోట్లు.. ఇంతకీ స్పెషల్ ఏమిటి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -