Thursday, March 28, 2024
- Advertisement -

జగన్‌ అక్రమాస్తుల కేసులో… ఈడీకి ఎదురుదెబ్బ

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ అక్ర‌మాస్తుల‌ కేసుల‌నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతోంది. గ‌తంలో ఇదే కేసుల‌పై ఆరోప‌న‌ల‌ను ఎదుర్కొంటున్న అనేక మంది అధికారుల‌పై ఉన్న అభియోగాల‌ను కోర్టు కొట్టివేయ‌డం తెలిసిందే. అయితే తాజాగా జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జ‌గ‌తి ప‌బ్లికేష్‌న‌కు సంబంధించ‌న ఆస్తుల‌ను జ‌ప్తువిష‌యంలో ఈడీకి దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది.

అస‌లు విష‌యానికి వస్తే జగతి పబ్లికేషన్లో ముగ్గురు వ్యాపారుల పెట్టుబడుల వ్యవహారంలో 34.64 కోట్ల రూపాయలను ఈడీ తాత్కాలిక జప్తు చేయడాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ తప్పు పట్టింది. ఈడీ ఉత్తర్వులను కొట్టివేసింది. మోసపూరితంగా పెట్టుబడులు స్వీకరిస్తే మనీలాండరింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించింది అప్ప‌లేట్ అథారిటీ.దీంతో జగన్ అక్రమాస్తుల కేసులో అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో ఈడీకి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.

జగతి పబ్లికేషన్స్‌కు సంబంధించిన రూ. 34.64 కోట్లను తాత్కాలిక జప్తు చేస్తూ 2013లో ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను ట్రిబ్యునల్ కొట్టివేసింది. జగతి పబ్లికేషన్స్‌లో టీఆర్ కణ్ణన్, ఏకే దండమూడి, మాధవ్ రామచంద్రన్ అనే ముగ్గురు వ్యాపారులు 34.64 కోట్లు పెట్టబడులు పెట్టారు. ఇలాంటి ప‌రిణామాలు జ‌గ‌న్‌కు శుభ‌ప‌రిణామ‌నే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -