Friday, March 29, 2024
- Advertisement -

అమెరికా – భారత్ విబేధాలు స్టార్ట్..!

- Advertisement -

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆహార పదార్థాలకు ‘జన్యు మార్పిడివి కాదు’ అన్న ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్న భారత్ నిర్ణయంపై అమెరికా అభ్యంతరం తెలిపింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు ఫిర్యాదు చేసింది.

ధ్రువీకరణ సమర్పణను రానున్న జనవరి ఒకటో తేదీ నుంచి తప్పనిసరి చేస్తూ భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశాలు ఇచ్చింది. గోధుమలు, బియ్యం, బంగాళదుంపలు, టమాటా సహా 24 పంటలకు దీన్ని వర్తింపజేస్తూ ఆగస్టు నెలలో ఉత్తర్వులు జారీ చేసింది.

ఎగుమతి చేసే దేశాలపై ఇది అనవసర భారం మోపుతుందని అమెరికా ఆరోపించింది. సాంకేతికంగా సంప్రదాయ పంటలకు, జన్యు మార్పిడి పంటలకు మధ్య ఎలాంటి తేడాలు లేవని, కానీ భారత్ ఇవి సురక్షితమైనవి కావంటోందని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -