Thursday, May 9, 2024
- Advertisement -

నిజమా.. అంత పని చేస్తోందా!!?

- Advertisement -

దేశ వ్యాప్తంగా ఎటు చూసినా.. కాంగ్రెస్ కు సరైన దిక్కే కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికలు జరిగి రెండేళ్లు కావొస్తోంది. చరిత్రలో ఎరగని ఘోర పరాజయానికి తోడు.. రాష్ట్రాల్లో వరుస ఎన్నికల్లోనూ సేమ్ సీన్. ఒకటీ అరా మంచి ఫలితాలు తప్ప.. గట్టిగా భుజాలు చరుచుకునే రిజల్ట్స్ ఎక్కడా లేవు. ఇలాంటి పరిస్థితిలో.. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఆ పార్టీకి విషమపరీక్ష పెట్టనున్నాయి.

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం.. దేశ రాజకీయాలకు కేంద్రం అయిన ఉత్తరప్రదేశ్ లో.. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపైనే కాంగ్రెస్ లో తీవ్ర స్థాయి అంతర్మథనం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు ఇప్పటికే జనంలోకి చొచ్చుకుపోతున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. మరోవైపు రీసెంట్ గా కేబినెట్ విస్తరణతో పార్టీలో జోష్ పెంచిన అధికార పార్టీ సమాజ్ వాదీ.. మరోవైపు తన పాత మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేసేందుకు ఆరాటపడుతున్న బహుజన్ సమాజ్ వాదీ పార్టీ.. వీటి మధ్య ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్.

ఇంత మందిలో తమది పై చేయి కావాలంటే ఎలా ముందుకు వెళ్లాలన్నదే.. కాంగ్రెస్ కు అర్థం కాకుండా మారిందని సమాచారం. ఈ సిచువేషన్ లోనే.. చీకటిలో నక్షత్రంలా కాంగ్రెస్ కు ప్రియాంకా గాంధీ కనిపిస్తున్నారు. ఆమె నాయకత్వంలో అయితేనే.. యూపీ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోగలమనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇప్పటికే ప్రియాంకాగాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని నేతలు కూడా వాయిస్ వినిపిస్తున్నారు.

ఈ విషయాన్ని కాస్త సీరియస్ గానే పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం కాకుండా.. ఆమెకు ప్రచార బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తోంది. ఎన్నికల సమయం పీక్ స్టేజ్ కు చేరినపుడు.. ఏకంగా 150 ర్యాలీలతో ఉత్తరప్రదేశ్ ను ప్రియాంకగాంధీ చుట్టేసేలా ప్లాన్ కూడా రెడీ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే.. ఎంతో కొంత ప్రభావం చూపగలమని కాంగ్రెస్ నమ్ముతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -