Sunday, May 26, 2024
- Advertisement -

పాలిటిక్స్ లో పోరుగల్లు బై పోల్ హీట్

- Advertisement -

వరంగల్ ఎంపీ సెగ్మెంట్ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారు కావడంతో.. పార్టీలకు పరీక్షా కాలం మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు బై పోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో…ఉప ఎన్నిక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానంలోబై పోల్ కు మరో 3 రోజుల్లో నోటిఫికేషన్ రానుంది. సిట్టింగ్ సీట్ కావడంతో ఉప ఎన్నికను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరంగల్ సీట్ ను నిలబెట్టుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్న అధికార పార్టీ టీఆర్ఎస్.. 3 నెలల ముందు నుంచే అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తోంది. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో సర్వే కూడా చేయిస్తోంది.

ప్రభుత్వ విభాగాల నుంచి తెప్పించుకున్న సమాచారాన్ని  సీఎం కేసీఆర్ స్టడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో రిపోర్ట్ రాగానే… బరిలో దిగేది ఎవరన్న విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విపక్షాల నుంచి పోటీ చేసేది ఎవరో తేలాకే.. తమ అభ్యర్థిని అనౌన్స్ చేయాలన్నది టీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది.

విపక్షాలు కూడా ఈ సారి గెలుపే టార్గెట్ గా.. అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టాయి.ఉప ఎన్నికలో గెలిచి ప్రజల్లో పట్టు పెంచుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ .. అభ్యర్థిపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఓ సారి పార్టీ స్టేట్ ఇన్ చార్జ్ దిగ్విజయ్ రాష్ట్రంలో పర్యటించారు. నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను ఢిల్లీ తీసుకెళ్లారు. ఉమ్మడిగా పోటీ చేస్తున్న TDP, BJP కూడా వారం నుంచి వరంగల్ MP సెగ్మెంట్ పరిధిలో సర్వే చేయించుకున్నాయి. 2 పార్టీల మధ్య ఓ అంగీకారం కుదరగానే.. అభ్యర్థి ఖరారయ్యే చాన్స్ ఉంది.బలాలు, బలహీనతలపై అంచనాలతో బిజీగా ఉన్న ప్రధాన పార్టీలు.. అభ్యర్థి ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మరోవైపు.. 10 వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపాయి. ఓయూ లా పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ గాలి వినోద్ కుమార్ ను అభ్యర్థిగా ప్రకటించి.. తోటి పార్టీలకు సవాల్ విసిరాయి.

ఈ నెల 28న నోటిఫికేషన్ రాగానే.. ప్రధాన పార్టీల నేతలంతా వరంగల్ లోనే మకాం వేసేలా బ్యాక్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సీట్ నిలబెట్టుకుంటే ప్రజల్లో పట్టు మరింత పెంచుకోవచ్చని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అధికార పార్టీకి చెక్ పెడితే.. జనంలోకి సులువుగా వెళ్లొచ్చని ప్రతిపక్ష నేతలు ఆరాటపడుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల బలాలు, బలహీనతలపై కన్నేస్తున్న ఈ పార్టీలు.. ఒకట్రెండు రోజుల్లో డైరెక్ట్ గా రంగంలోకి దిగేందుకు పొలిటికల్ ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -