Thursday, April 25, 2024
- Advertisement -

వావ్ : వాట్సప్ కొత్త ఫీచర్స్ .. అదిరిపోయింది గురూ !

- Advertisement -

ప్రస్తుతం ఈ ఇంటర్ నెట్ యుగంలో సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా నెట్వర్క్ లో యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్, వాట్సప్ వంటి మొబైల్ యాప్స్ చూడనిదే ఎవ్వరికీ రోజు గడవదు. అంతే కాకుండా మన రోజు వారి దినచర్యలో సోషల్ మీడియా ఒక భాగం అయిపోయింది. ముఖ్యంగా ఒకరి నుంచి మరొకరికి మెసేజ్ లు పంపుకునే విధానాన్ని మరింత సులభతరం చేసి టెక్నాలజీని సరికొత్త పుంతలు తొక్కించిన వాట్స్ ఆప్, మొబైల్ మెసేజింగ్ యాప్స్ లో అగ్రగామిగా కొనసాగుతోంది. ప్లే స్టోర్ లో 5 బిలియన్ యూసర్స్ ఉన్న ఈ మెసేజింగ్ యాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో యూసర్స్ ను ఆకట్టుకుంటూనే ఉంది.

తాజాగా మరికొన్ని సరికొత్త ఫీచర్స్ ను తీసుకురానున్నట్లు వాట్సప్ యాప్ మాతృ సంస్థ మెటా ప్రకటించింది.ఇది వరకు పరిమితి సంఖ్యలోనే గ్రూప్ చాట్ కు అనుమతి ఉంచిన నేపథ్యంలో కొత్తగా 512 మందితో ఒకేసారి గ్రూప్ చాట్ చేసుకునే సరికొత్త ఫీచర్ ను తీసుకురానుంది వాట్సప్. ఈ ఫీచర్ తీసుకురానున్నట్లు గత నెలలోనే మెటా సంస్థ ప్రకటించింది. అంతే కాకుండా 2జి‌బి స్టోరేజ్ వరకు ఫైల్స్ ను షేర్ చెయ్యడం వంటి ఫీచర్ ను కూడా తీసుకురానుంది. ఇంతకు ముందు ఏ ఫైల్ అయిన 100 ఎం‌బి వరకు మాత్రమే షేర్ అయ్యేది.

కానీ కొత్తగా ప్రవేశ పెట్టబోతున్న ఫీచర్ తో యూసర్స్ కు ఎలాంటి అంతరాయం లేకుండా 2జి‌బి వరకు ఫైల్స్ షేర్ చేసుకునే విధంగా ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన ” ఆన్ డూ ” ఫీచర్ కూడా వాట్సప్ తీసుకురాబోతుంది. గతంలో ఎవరికైనా మెసేజ్ చేసిన తరువాత ఆ మెసేజ్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే డిలెట్ చేస్తాం. కానీ తిరిగి ఆ మెసేజ్ ను పొందలేము. దీంతో డిలీట్ అయిన మెసేజ్ ను తిరిగి పొందేందుకు ” ఆన్ డూ ” ఫీచర్ ను ప్రవేశపెట్టబోతోంది వాట్సప్. ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఉపయోగకరంగా ఉండడంతో యూసర్స్ ఈ సరికొత్త ఫీచర్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Also Read

ఈ పండ్లు, కూరగాయలు మధుమేహుల పాలిట వరాలు…

మధ్యాహ్నం పడుకుంటున్నారా ? అయితే ఇది తప్పక చదవండి…

అమ్మాయిలు చెప్పుకోలేని కొన్ని రహస్యాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -