Friday, April 19, 2024
- Advertisement -

పత్రికలు చూసి ప్రభుత్వానికీ చురకులు పెట్టిన హైకోర్టు..!

- Advertisement -

నూతన సంవత్సర వేడుకల నియంత్రణకు కేసిఆర్ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడం లేదని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆంక్షలు విధించక పోగా.. అర్ధరాత్రి వరకు అనుమతులు ఇచ్చినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయని పేర్కొంది. ముంబయి, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో వేడుకల నిషేధం, రాత్రి కర్ఫ్యూ వంటివి పెట్టారని.. ఇక్కడ కూడా అమలు చేయలేరా అని న్యాయస్థానం ప్రశ్నించింది.కరోనాకు సంబంధించిన వివిధ అంశాలతో దాఖలైన 26 వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్​సేన్​రెడ్డిల ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.

ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మూసివేస్తే సరిపోదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హాళ్లు, గదుల్లో గుమిగూడి వేడుకలు చేసుకున్నా ప్రమాదమేనని పేర్కొంది. కరోనా వ్యాప్తి పొంచి ఉండవచ్చునని.. ప్రచారంలో పాల్గొన్న వారంతా క్వారంటైన్​లో ఉండాలని జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారని హైకోర్టు గుర్తు చేసింది.

జస్టిస్‌ అరూప్‌ గోస్వామి ఏపి లోకి ఎంట్రీ..!

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

దేవునితో చెలగాటం వద్దు : సీఎం జగన్

గుడ్ న్యూస్ చెప్పిన మోదీ.. స్వదేశీ టీకా వచ్చేస్తుంది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -