Monday, April 29, 2024
- Advertisement -

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

- Advertisement -

జనవరిలోపు అన్నిశాఖల్లో పదోన్నతులు పూర్తి చేస్తామని ఉద్యోగులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. జనవరి 6, 7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సీఎస్ కమిటీని ఆదేశించారు. జనవరి మూడో వారంలో వేతన సవరణను ప్రకటించనున్నారు. టీజీవో, టీఎన్జీవో, సచివాలయ ఉద్యోగ సంఘాలతో ప్రగతి భవన్​లో సీఎం సమావేశమయ్యారు. వేతనాలు పెంపు, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.

ప్రభుత్వానికి ఇవాళ వేతన సవరణ సంఘం నివేదిక ఇవ్వనుంది. పీఆర్సీపై వెంటనే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వీఆర్వోలను త్వరలోనే రెవెన్యూశాఖలో సర్దుబాటు చేస్తామన్నారు. అవసరాలు, వీఆర్వోల ఇష్టప్రకారం ఇతర శాఖల్లోనూ సర్దుబాటు చేస్తామని తెలిపారు. ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను త్వరగా రాష్ట్రానికి తీసుకొస్తామని చెప్పారు. త్వరలో ఉపాధ్యాయ సంఘాలతోనూ సమావేశం అవుతామన్నారు. ఉద్యోగ సంఘాల డైరీలను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.

దేవునితో చెలగాటం వద్దు : సీఎం జగన్ మోహన్ రెడ్డ

ఇక పై పిల్లలికి ఆ రెండు తినుబండారాలు బంద్..!

కేరళ అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం..!

బైడెన్ టీకా పంపిణీ పై వివాదాస్పద వ్యాఖ్యలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -