- Advertisement -

ప్ర‌శాంత్ కిషోర్ చెప్తే వింటాడా….?

- Advertisement -

వ‌చ్చె సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపు జ‌గ‌న్‌కు జీవ‌న్‌మ‌ర‌ణ స‌మ‌స్య‌లాంటిది. గెలిస్తే జ‌గ‌న్‌కు భ‌విస్య‌త్ ఉంటుంది. అందుకె అధికారంలోకి రావ‌డానికి చివ‌రి అస్త్రంగా ఆరునెల‌ల‌పాటు పాద‌యాత్ర అస్త్రాన్ని సంధించారు. పాద‌యాత్ర‌లో టీడీపీ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంతోపాటు అధికారంలోకి వ‌స్తె ప్ర‌జ‌ల‌కు ఏంచేస్తామో చెప్తూ పార్టీ ప‌ట్ల విశ్శ‌నీయ‌త పెరిగేలా పాద‌యాత్ర‌ను రూపొందించుకున్నారు.

పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల‌నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. అయితె ఆయ‌న స్పీచ్‌లో అంత ప‌దును ఉండ‌టంలేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ చేసిన పాద‌యాత్ర‌లో నమస్తే చెల్లెమ్మా.. నమస్తే అక్కయ్యా… నమస్తే తమ్ముడూ కొత్త ఒర‌వ‌డిని తీసుకొచ్చారు. ఆ వ్యాఖ్య‌లు పాపుల‌ర్ అయ్యాయి. ఆయ‌న చ‌నిపోయిన స‌మ‌యంలోను చాలామంది వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేసుక‌న్నారు. కాని జ‌గ‌న్‌లో మాత్రం ఆ జోష్ లేద‌న్న‌ది తెలుస్తోంది.ఎంత‌సేపు సానుభూతితో ఓట్లు అడుగుతున్నాడె త‌ప్పా ప్ర‌జ‌ల‌కు ఒక ధీమాతో ముందుకెల్ల‌డంలేద‌న్న‌ది వినిపిస్తోంది.

పాదయాత్రల్లో జగన్ ఇచ్చే స్పీచులు ఎక్కువగా ఇన్‌స్టంట్ హామిల చుట్టే తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. రోగుల‌కు చికిత్స కోసం డ‌బ్బుల‌తోపాటు, ఆసుప‌త్రిలో విశ్రాంతి తీసుకునే స‌మయానికి కూడా డ‌బ్బులు ఇస్తానమనడం, ఇద్ద‌రు పిల్ల‌ల్ని బ‌డికి పంపితే.. కుటుంబానికి రూ.1500ఇస్తానడం వంటివి అందులో ప్రధానంగా కనిపిస్తున్నాయి. స్పీచుల్లోను పదేపదే చెప్పిన అంశాలే రిపీటవుతుండటంతో మున్ముందు జగన్ కు ఇది ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జగన్ తన స్పీచ్ ఫార్ములాను మార్చుకోవాలన్న సలహాలు కూడా వినిపిస్తున్నాయి.

గత నాలుగు రోజుల జగన్ పాదయాత్రను గమనిస్తే.. ఆయన స్పీచుల్లోని లోపాలు స్పష్టమవుతున్నాయి. ఆరంభ సభలో చెప్పిన అంశాలనే ఆ తర్వాతి సభల్లోను ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నారు. హామిలను జనంలోకి తీసుకెళ్లడం వరకు బాగానే ఉంది కానీ ప్రభావవంతంగా చెప్పలేకపోతున్నారా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాట తీరు దాడి చేసినట్టుగా కాకుండా స్పీచులను మరింత సానబెట్టుకుని ప్రజలతో కమ్యూనికేట్ కావాల్సిన అవసరం కనిపిస్తోందంటున్నారు.

జ‌గ‌న్ పాదయాత్ర తీరు తెన్నులను ప్రశాంత్ కిశోర్ టీం గమనిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రజా సంకల్ప యాత్రను ఓ ప్రత్యేక టీమ్ ను నియమించుకుని మరీ ఆయన చిత్రీకరిస్తున్నారు. యాత్రలో నుంచి కొన్ని ప్రత్యేక విజువల్స్, జగన్ స్పీచ్ కటింగ్స్ తో వీడియోలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. పీకె చెబితే జగన్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉండటంతో.. ఆయన నుంచే ఈ సలహా వ్యక్తమవాలని భావించేవారు లేకపోలేదు. అదే స్పీచ్ కొన‌సాగితె ఆరునెల‌లు జ‌రిగె పాద‌యాత్ర‌లో కొత్తేముంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -