- Advertisement -

ప్ర‌పంచంలోనే మొట్ట మొద‌టి డిజిట‌ల్ స‌మాధి…

- Advertisement -
World’s first digital tombstone in Slovenia

ప్ర‌పంచంలో పుట్టిన వాడు మ‌ర‌నించ‌క త‌ప్ప‌దు.చ‌నిపోయిన వారిని కాల్చ‌డ‌మో..పూడ్చ‌డ‌మో చేయ‌డం అన‌వాయితి.చ‌నిపోయిన వారు గొప్ప‌వార‌యితే వారి జీవిత చ‌రిత్ర‌కు సంబందించి అన్నిఅంశాలు బుక్‌రూపంలో ఉంటాయి.

అయితే ఇప్పుడు మార్పులు వ‌స్తున్నాయి.ప్ర‌పంచం అంతా డిజిట‌ల్‌వైపు మ‌ల్ల డంతో చ‌నిపోయిన వారి స‌మాధులు కూడా డిజిట‌ల్ స‌మాధులుగా మారుతున్నాయి.
వస‌లు విష‌యానికి వ‌స్తే ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్‌ సమాధి రాయి మధ్య యూరప్‌ దేశమైనా స్లొవేనియాలోని రెండవ అతిపెద్ద నగరమైన మారిబోర్‌ శ్మశానంలో వెలిసింది. 48 అంగుళాల ఈ డిజిటల్‌ స్క్రీన్‌పై మరణించిన వ్యక్తి డిజిటల్‌ చిత్రం, ఇతర వ్యక్తిగత వివరాలు ఉంటాయి. మున్ముందు మరణించిన వ్యక్తి జీవితానికి సంబంధించిన వీడియోలను కూడా ఈ స్క్రీన్‌పై చూడొచ్చు.

{loadmodule mod_custom,Side Ad 1}

ప్రస్తుతం డిజిటల్‌ స్క్రీన్‌ సమాధి రాయితో సమాధిని ఏర్పాటు చేయడానికి దాదాపు మూడు లక్షల రూపాయలు అవుతుందట. మొదట చూడడానికి ఇది మామూలు గ్రానైట్‌ సమాధి రాయిగానే కనిపిస్తుంది. దాని ముందు ఎవరైనా కొన్ని క్షణాలపాటు నిలబడితే సెన్సర్ల ద్వారా అది డిజిటల్‌ స్క్రీన్‌గా మారిపోతుంది. దీనిపై అత‌నిపేరు, ఊరు, ఫొటోతోపాటు మొత్తం ఫొటో ఆల్బమ్‌నుతోపాటు జీవిత విశేషాల‌తో రాసిన న‌వ‌ల‌నుకూడా పొంద‌ప‌ర‌చ‌వచ్చును. ఈ డిజిటల్‌ సమాధి రాళ్లను అమ్ముతున్న బయోఎనర్జిజా కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ సమాధి రాయిని మారిబోర్‌ నగరంలోని పోబ్రెజ్జీ శ్మశాన వాటికలో ఏర్పాటు చేశారు.

{loadmodule mod_custom,Side Ad 2}

ఎవరైనా డిజిటల్‌ సమాధి రాయి ముందు నిలబడ్డప్పుడు మాత్రమే ఫొటో ఆల్బమ్, ఇతర వివరాలు కనిపిస్తాయని, ఎదురుగా లేనప్పుడు కేవలం మతుడి పేరు, చనిపోయిన తేదీ మాత్రమే కనిపిస్తుంది.మున్ముందు వీడియో, ఆడియోలను ప్రదర్శించేందుకు వీలుగా దీనికి ఓ ప్రత్యేకమైన యాప్‌ను తయారు చేస్తున్నామని చెప్పాయి. శ్మశానంతో మైకులు ఉపయోగించడం మంచిది కాదుకనుక ఇయర్‌ ఫోన్ల సౌకర్యం కల్పిస్తామని తెలిపాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}4V3Uqh38w2U{/youtube}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -