Tuesday, May 7, 2024
- Advertisement -

జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌న‌లో వైసీపీనేత‌ల‌కు నోటీసులు పంపిన సిట్ అధికారులు

- Advertisement -

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అక్టోబర్ 25వ తేదీన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి పాల్పడిన శ్రీనివాసరావును విశాఖ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. శ్రీనివాస్‌తో సంబంధాలు క‌లిగి ఉన్న అంద‌ర్నీ సిట్ అధికారులు విచారిస్తున్నారు. దీనిలో భాగంగా ఇద్ద‌రు వైసీపీ నేత‌ల‌కు కూడా నోటీసులు అందించారు.

జ‌గ‌న్ కేసు విచార‌ణ‌లో భాగంగా దాడి జరిగిన సమయంలో అక్కడ ఉన్న వైసీపీ నేతలు పీడిక రాజన్నదొర (సాలూరు ఎమ్మెల్యే), మజ్జి శ్రీనివాసరావులకు సీట్‌ అధికారులు నోటీసులు అందించారు. నవంబర్‌ 2వ తేదీన విశాఖలోని సిట్‌ కార్యాయంలో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీస‌లపై పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.

నోటీసులపై స్పందించిన ఈ ఇద్దరు నాయకులు తాము నేరుగా విచారణకు హాజరు కామని, అధిష్ఠానం ఆదేశాల మేరకు న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇస్తామని చెప్పినట్లు సమాచారం. నోటీసులు ఇచ్చిన విషయాన్ని మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ధ్రువీకరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -