- Advertisement -
ఎప్పుడూ ప్రజలకు వెన్నుదన్నుగా ఉండి ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో మా పార్టీ పోరాడుతుందని చెప్పే ఏపి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు దూకుడు పెంచారు.
దీనిలో భాగంగానే బలవంతంగా రైతుల భూములను లాక్కుంటున్నారని, భూ సేకరణకు వ్యతిరేఖంగా వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేయనున్నారు. విజయవాడలోని రాజధాని అభివృద్ది సంస్థ కార్యాలయం వద్ద ఈ నెల 26న జగన్ దీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. రాజధాని రైతులకు అండగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అందోళనలు చేస్తుందని పేర్కొన్నారు.
ఈ నెల 23నుంచి భూసేకరణపై వరుసగా మూడు రోజులు ఆందోళన నిర్వహిస్తున్నట్లు వామపక్షాల ఆధ్యర్యంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ నెల 29న కూడా ఏపికి ప్రత్యేక హోదా కావాలని బంద్‌కు పిలుపుచ్చిన సంగతి తెలిసిందే..
