Thursday, May 9, 2024
- Advertisement -

జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌… తొలి అడుగులు

- Advertisement -

వైఎస్సార్సీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జాసంక‌ల్ప పేరుతో పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. ప్ర‌తీ రోజు దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర.. మొత్తం 180 రోజులు.. 120 నియోజకవర్గాలు.. సుమారు 3 వేల కిలోమీటర్లు పాద‌యాత్ర జ‌ర‌గ‌నుంది. అక్కడక్కడా బహిరంగ సభలు.. కొన్ని చోట్ల ప్రత్యేకంగా వివిధ సమూహాలతో ప్రత్యేక చర్చలు.. వాటి ఫలితాల ఆధారంగా మేనిఫోస్టోలో పెట్టాల్సిన అంశాలపై పార్టీ ముఖ్య నేతలతో భేటీలు ఇది సంక‌ల్ప‌యాత్ర‌.

అయితె పాద‌యాత్ర‌లో మార్పులు చేటుచేసుకొనె అవ‌కాశం ఉంది. ప్ర‌తీ శుక్ర‌వారం కోర్టుకు హాజ‌రుకావ‌ల్సి ఉండ‌టంతో పాద‌యాత్ర అద‌నంగా మ‌రో నెల‌రోజులకు పైగా సాగె అవ‌కాశ‌ముంది. పాద‌యాత్ర‌లు చేయ‌డం కొత్తేం కాదు. ఒకప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేస్తే, ఆ తర్వాత చంద్రబాబు పాదయాత్ర చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె కూడా పాదయాత్ర చేసి, ‘ఔరా’ అన్పించారు.

జగన్‌ పాదయాత్రను అడ్డుకోవడానికి అధికార పార్టీ పిల్లిమొగ్గలు వేసిన విష‌యం అంద‌రికితెలిసిందే. కాని జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌తో మంద‌డుగు వేశారు. అనుమతి తీసుకుంటే తప్ప, పాదయాత్ర చేయడానికి వీల్లేదు..’ అని హెచ్చరికలు జారీ చేసినా, జగన్‌ బేషజాలకు పోలేదు. ఓ రాజ‌కీయ‌నాయ‌కుడు పాద‌యాత్ర చేయాలంటె ఇన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కొవాలా…? జ‌నం వ‌ద్ద‌కు ప్ర‌తిప‌క్ష‌నేత వెల్లాలంటె ప్ర‌హుత్వం అఏమ‌తి తీసుకోవాలా..?ఇవ‌న్నీ జ‌గ‌న్ అధిగ‌మించారు.

ప్రజా సంకల్పం తొలి రోజు తొలి అడుగు.. రాష్ట్రంలో పెను మార్పుకి శ్రీకారం.. అని వైఎస్సార్సీపీ చెబుతోంది. తొలి రోజు పాదయాత్రలోనే భారీ బహిరంగ సభ జరగనుంది. మొత్తమ్మీద, ఓ వైపు పార్టీ ఫిరాయింపులు.. ఇంకో వైపు అధికార పార్టీ బెదిరింపులు.. ఈ గందరగోళం నడుమ, ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్రకు తొలి అడుగు వేసిన జ‌గ‌న్ రాష్ట్ర రాజ‌కీయాల్లో పెనుమార్పులు కు కేంద్రం కానుందోలేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -