Friday, May 3, 2024
- Advertisement -

జ‌గ‌న్‌ను ఈ హ‌త్యాప్ర‌య‌త్నం నుంచి కాపాడింది ఎవ‌రో తెలుసా..?

- Advertisement -

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జగన్మోహన రెడ్డి మీద హత్యాయత్నం రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్తుల ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. క‌త్తితో దాడి చేసే స‌మ‌యంలో ర్టీలోని సీనియర్ నాయకుడు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి బియ్యపు మధుసూనరెడ్డి లేకుంటే ఈ పాటికి జ‌గ‌న్ ప‌రిస్థి వేరేవిధంగా ఉండేది.

కోర్టుకు హాజ‌రు అవ్వ‌డంకోసం పాద‌యాత్ర‌కు విరామం ఇచ్చి హైద‌రాబాద్ రావ‌డానికి జ‌గ‌న్ విశాఖ ఎయిర్‌పోర్టుచు చేరుకున్నాడు. జ‌గ‌న్ లాంజ్‌లో కూర్చున్నాడు.సెల్ఫీ తీసుకోవడం కోసం వెయిటర్ శ్రీనివాస్ జగన్ సమీపానికి వ‌చ్చి జ‌గ‌న్‌పై దాడి చేసిన సంగ‌తి తెల‌సిందే.

జగన్ మోహన్ రెడ్డి లాంజ్ లో కూర్చుని ఉండగా.. ఆయనకు అత్యంత సమీపంలో వాటర్ బాటిల్ పట్టుకుని వెయిటర్ శ్రీనివాస్ నిల్చుని ఉన్నాడు. జగన్ కు చాలా దగ్గరగా ఉన్నాడు. ఆ సమయంలో శ్రీకాళహస్తి పార్టీ ఇన్చార్జి అయిన బియ్యపు మధుసూదన్ రెడ్డి.. విజయవాడకు చెందిన ఒక నాయకుడిని జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేయడానికి జగన్ వద్దకెళ్లి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు.

శ్రీనివాస్ తన వద్ద దాచుకున్న కత్తితో జగన్ ను పొడవడం కూడా జరిగింది. అయితే జగన్ గుండెల మీద పొడుస్తున్న సమయంలో పక్కనుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి పిలవడంతో.. జగన్ కుడివైపునకు తిరిగారు. ఆయన కుడిపక్కకు తిరగడంతో కత్తి జగన్ ఎడమ భుజానికి దిగువన పొడుచుకుంది. లేకుంటే ఆ క‌త్తి జ‌గ‌న్ గుండెల్లో దిగేది. మ‌ధుసుద‌న్ రెడ్డి లేక‌పోయింటే జ‌గ‌న్ ప‌రిస్థితి మ‌రో విధంగా ఉండేది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -