Thursday, April 25, 2024
- Advertisement -

సెల్యూట్ కొట్టిన అధికారుల‌తోనె సెల్యూట్ కొట్టించ‌క‌కున్న సామాన్య‌నేత‌

- Advertisement -

ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న‌విజ‌యం సాధించింది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల‌ను గెలుచుకొని దేశంలోనె పార్లమంట్‌లో అతి పెద్ద నాలుగో పార్టీగా అవ‌త‌రించింది. ఆయితే ఆ పార్టీనుంచి ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్యంలేని సామాన్యులు కూడా అసెంబ్లీ, పార్ల‌మెంట్‌లో కాలు మోప‌నున్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ ఎక్కువ‌గా త‌న న‌వ‌ర‌త్నాల‌మీద‌నె ప్ర‌చారం కొన‌సాగించారు. వాటితో పాటు బాబు వైఫ‌ల్యాల‌పై స‌మ‌ర‌బేరి మోగించారు. బ‌ల‌మైన టీడీపీనేత‌ల‌ను ఎదుర్కోవాలంటె బ‌ల‌మైన నేత‌ల‌నే దింపాల‌న్న నానుడికి చ‌ర‌మ‌గీతం పాడారు. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంటె సామాన్యుడు కూడా చ‌ట్ట‌స‌భ‌ల్లో అడుగు పెట్ట‌వ‌చ్చ‌ని నిరూపించారు జ‌గ‌న్.

జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ప్రత్యర్థికి గట్టిపోటీ ఇస్తారనుకున్న వారికే టికెట్లు కన్ఫామ్ చేశారు. హిందూపురంనుంచి ఎవ‌రూ ఊహించ‌ని సామాన్యున్ని ఎంపీ బ‌రిలోకి దింపారు. ఇక్క‌డ జ‌గ‌న్ లెక్క త‌ప్పుతుంద‌ని అంద‌రూ అనుకున్నారా కాని జ‌గ‌న్ లెక్కే చివ‌ర‌కు క‌రెక్ట్ అయ్యింది. సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పపై కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల మాధవ్ ని నిలబెట్టారు. అయితే జగన్ అంచనాల్ని నిలబెడుతూ, 1,38,137ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి సంచ‌ల‌నం సృష్టించారు.

గోరంట్ల మాధవ్ అనంతపురం సీఐగా పనిచేశారు. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో మంచి పేరుంది. ప్రభోదానంద ఆశ్ర‌మ విష‌యంలో ఎంపీ జేసీకి పోలీసుల‌కు మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. జేసీ పోలీసుల‌ను అన‌రాని మాట అన్నారు. దీంతో సీఐ మాధ‌వ్ మీసం మెలేసి జేసీ దివాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. అంతే రాత్రికి రాత్రే స్టార్ గా మారారు.

దీంతో అప్ప‌టిక‌ప్పుడు వైసీపీలో రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోయాయి. మాధ‌వ్ ధైర్యాన్ని చూసిన జ‌గ‌న్ ఏకంగా హిందూపూర్ ఎంపీ టికెట్‌ను కేటాయించారు. అయితే మాధ‌వ్ నామినేష‌న్ వేయ‌కుండా టీడీపీ ప్ర‌భుత్వం ఎంత‌లా ఇబ్బంది పెట్టిందో అంద‌రికి తెలిసిందే. చివ‌ర‌కు హైకోర్టు ఆదేశాల‌తో సీఐగా మాధవ్ రాజీనామాకు ఆమోదం అభించింది. అంతే ఇంకేముంది ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన టీడీపీ సిట్టింగ్ ఎంపీ నిమ్మ‌ల కిష్టప్పకు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేకుండా 1,38,137ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.

అప్పటి వరకూ వందలసార్లు ఎంపీ కిష్టప్పకు సెల్యూట్ చేసిన ఆ చేత్తోనే.. ఆయన్ని ఓడించారు. కౌంటింగ్ రోజున జరిగిన మరో అరుదైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఐగా ఉండగా.. తన డిపార్ట్ మెంట్ లోని ఉన్నతోద్యోగులకు సెల్యూట్ చేసిన మాధవ్, ఎంపీగా ఎన్నికైన తర్వాత అదే డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారుల నుంచి సెల్యూట్ అందుకున్నారు.హిందూపూర్ కౌంటింగ్ కేంద్రంలో ఈ సెల్యూట్ ఫొటో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇదేనేమో బండ్లు ఓడ‌లు అవ‌డం….ఓడ‌లు బండ్లు అవ‌డం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -