Tuesday, May 7, 2024
- Advertisement -

టీడీపీ మొద‌టిజాబితా విడుద‌లకు ముహూర్తం ఫిక్స్‌….

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో చంద్ర‌బాబు నాయుడు స్పీడ్ పెంచారు. అభ్య‌ర్థుల విష‌యంలో తెలంగాణాలో జ‌రిగిన త‌ప్పు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ కంటే కనీసం నెల రోజుల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున సంక్రాంతి పండుగ వెళ్లిన వెంటనే మొదటి జాబితాను ప్రకటించాలని నిర్ణయించారట. మొత్తం 175 సీట్లకు గాను కనీసం 100 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసేందుకు ప్రణాళికను సిద్దం చేసుకొంటున్నారు. తొలి జాబితాలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మొత్తం మీద అభ్యర్ధులను ముందుగా ప్రకటించటం నిజమే అయితే చంద్రబాబు నైజానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నట్లే అను కోవాలి. బాబు ఎప్పుడుకూడా అభ్య‌ర్తుల‌ను ముందుగానే ప్ర‌క‌టించే సంప్ర‌దాయం బాబుకు లేదు. అభ్య‌ర్తుల‌ను ఊరడిస్తూ తీరా నామినేష‌న్ల స‌మ‌యంలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తారు.

ఫిబ్రవరి మూడో వారంలోనే ఎన్నిలక షెడ్యూల్ ప్రకటిస్తామని చీఫ్ ఎన్నికల కమీషనర్ చేసిన ప్రకటన అందరికీ గుర్తుండే ఉంటుంది. దాంతో చంద్రబాబు స్పీడ్ పెంచుతున్నారు. తెలంగాణాలో కేసీఆర్ అనుస‌రించిన వైఖ‌రినే బాబ‌కూడా ఫాలో అవుతున్నారు.

మ‌రో వైపు ఇప్ప‌టికే జ‌గ‌న్‌కూడా సిట్టింగులను వదిలిపెట్టి సుమారుగా 20 నియోజకవర్గాల్లో జగన్ అభ్యర్ధులను ప్రకటించేశారు. 45 మంది సిట్టింగుల్లో దాదాపు అందరినీ పోటీ చేయించటానికి జగన్ సుముఖంగానే ఉన్నారు. ఈ ప‌రిణామాల‌ను బేరీజు వేసుకొని నియోజకవర్గాల్లో ఎవరికి టిక్కెట్లివ్వాలనే విషయంలో చంద్రబాబు ఇఫ్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారు. అందుకనే అభ్యర్ధుల ప్రకటనలో వెనకబడితే ఇబ్బందులు తప్పవని గ్రహించి ముందుస్తు ప్రకటన చేయబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -