కే‌సి‌ఆర్, పికే వ్యూహం.. ఫలించేనా ?

- Advertisement -

తెలంగాణలో ప్రస్తుతం కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికలే టార్గెట్ గా ఇప్పటికే అన్నీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రస్తుతం గులాబీ జెండా తెలంగాణ గడ్డపై రెపరెపలాడుతుంటే.. వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగురవేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కాషాయదళం. ఇక రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ కూడా గట్టి ప్రయత్నలే చేస్తుంటే.. కొత్తగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వచ్చే ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. కాగా గులాబీ బాస్ మూడవసారి కూడా అధికారం చేజిక్కించుకునేందుకు..ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించాడు. .

ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఎన్నికలే టార్గెట్ గా గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉన్నందువల్ల ప్రజల్లో ప్రస్తుతం పాలనపై అలాగే పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇక పికే సర్వేలో వచ్చిన రిజల్ట్ ను బట్టి వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై కే‌సి‌ఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంత అలజడి కలుగుతోందట. ఒకవేళ పికే సర్వేలో తమకు ప్రతికూల రిజల్ట్ వస్తే పార్టీ టికెట్ వస్తుందో లేదో అన్న అనుమానాలు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే చాలా మంది ఇతర పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పక్క అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూనే మరో పక్క ప్రతిపక్ష పార్టీతో మంతనాలు జరుపుతున్నారట ప్రస్తుతం టి‌ఆర్‌ఎస్ పార్టీలోని సిట్టింగ్ ఎమ్మేల్యేలు. అయితే ప్రస్తుతం అవినీతి పరంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు, ఎట్టి పరిస్థితుల్లో టికెట్ కేటాయించకూడదని ప్రశాంత్ కిషోర్,, కే‌సి‌ఆర్ సూచిస్తున్నాడట. దీంతో ఈ సారి పికే వ్యూహం ప్రకారం టి‌ఆర్‌ఎస్ లో కొత్తవారికి అవకాశం ఇచ్చే వైపుగా కే‌సి‌ఆర్ ప్రణాళికలు రచిస్తున్నాడట.. మరి ఈ వ్యూహం టి‌ఆర్‌ఎస్ కు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఆ పథకం రైతులకు అండ కాదు.. దండగా ?

మహిళా రాష్ట్రపతి విషయంలో.. బీజేపీ మాస్టర్ ప్లాన్ ?

వైసీపీ లో జంపింగ్ జపాంగ్ ..షురూ ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -