Saturday, April 27, 2024
- Advertisement -

జగన‌పై కేసులు రాజకీయ కక్ష్య సాధింపు కోసం పెట్టినవేః ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ

- Advertisement -

‘జగన్‌పై కేసులు రాజకీయ కక్ష్య సాధింపు కోసం పెట్టినవే’……..ఇవే మాటలను వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ నాయకులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. రాజకీయ విశ్లేషకులు, మేధావులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ చంద్రబాబు అండ్ కో మాత్రం ఎప్పుడూ ఈ నిజాన్ని ఒఫ్పుకోలేదు. ఎందుకంటే ఆ రాజకీయ కక్ష్య సాధింపుల కేసులను సోనియాగాంధీతో కలిసి చంద్రబాబే పెట్టించాడు కాబట్టి. జగన్ కేసుల విషయంలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్‌రావుతో పాటు, టిడిపి నేతలు కూడా భాగస్వాములే కాబట్టి. ఇక బాబు భజన బృందంలో ముఖ్య సభ్యుడు అయిన ఆంద్రజ్యోతి రాధాకృష్ణ అయితే జగన్‌పై ఓ స్థాయిలో రెచ్చిపోయాడు. జగన్‌ని ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడిగా, రాక్షసుడిగా చిత్రీకరించడం కోసం మాత్రమే ఆంద్రజ్యోతి మీడియా సంస్థల ద్వారా వార్తా కథలు వడ్డించాడు. ప్రజలను నమ్మించడంలో ఎంతో కొంత సక్సెస్ అయ్యాడు. మొత్తానికి 2014లో బాబును అధికారంలోకి తీసుకురావడంలో తన అబద్ధపురాతలు కూడా ఎంతో కొంత ఉపయోగపడ్డాయని చెప్పక తప్పదు. ఇక నారాయణ కాలేజీలతో సహా చాలా మంది విద్యార్థులతో ఈయన పెట్టిన కార్యక్రమాల్లో విద్యార్థుల ఆలోచనల్లో జగన్‌కి వ్యతిరేకంగా నూరిపోసిన విషం అంతా ఇంతా కాదు.

మరి అలాంటి రాధాకృష్ణ జగన్‌పై కేసులు రాజకీయ కక్ష్యసాధింపు కోసం పెట్టినవే అని అంటాడా? డైరెక్ట్‌గా అదే అర్థం వచ్చేలా తన వీకెండ్ కామెంట్‌లో రాసుకొచ్చాడు రాధాకృష్ణ. నరేంద్రమోడీపై ప్రస్తుతం చంద్రబాబుకి పీకల వరకూ కోపం ఉంది. కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా దారుణంగా అవమానిస్తున్నాడు. కానీ తనపై ఉన్న కేసుల దృష్ట్యా అణిగిమణిగి ఉండాల్సిన దుస్థితి చంద్రబాబుది. అందుకే తన భజన మీడియా బృందాల చేత మోడీపై విమర్శలు చేయిస్తున్నాడు. నిజానికి ఈ వారం వ్యాసంలో మోడీ గురించి రాధాకృష్ణ చేసిన కామెంట్స్ అన్నీ నిజాలే. అయితే మోడీని విమర్శించే క్రమంలో జగన్‌ కేసుల విషయాలకు సంబంధించిన నిజాలు కూడా ఒప్పేసుకున్నాడు రాధాకృష్ణ. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం వళ్ళనే జగన్‌పై కేసులు నమోదయ్యాయని చెప్పుకొచ్చాడు. అలాగే సిబిఐ, ఈడీలు ఢిల్లీ పాలకుల చేతిలో పంజరంలోని చిలకల్లా మారిపోయాయని చెప్పుకొచ్చాడు. కేవలం రాజకీయ కక్ష్య సాధింపుల కోసమే కేసులు పెడుతున్నారని, ఆ తర్వాత పాలకులకు సరెండర్ అయితే కేసులు ఎత్తేయిస్తున్నారని చెప్పుకొచ్చాడు. జగన్‌పై కేసులు రాజకీయ కక్ష్య సాధింపే, కాంగ్రెస్ నుంచి బయటకు రాబట్టే జగన్‌పై కేసులు పెట్టారన్న నిజాలను ఒప్పుకున్న రాధాకృష్ణ……ఇప్పుడు జగన్‌ కనుక మోడీకి సానుకూలంగా వ్యవహరిస్తే కేసులు నీరుగారిపోవడం కూడా ఖాయమని వాపోయాడు. ఈ మాటలు రాస్తున్నప్పుడు మాత్రం రాధాకృష్ణలో చాలా బాధా కనిపించింది.

అయితే ఇన్ని విషయాలు చెప్పిన రాధాకృష్ణ……హోదాతో సహా అన్ని విషయాల్లోనూ ఆంద్రప్రదేశ్‌ని నిలువునా ముంచిన మోడీ, కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని మోడీ దగ్గర చంద్రబాబు ఎందుకు సాగిలపడుతున్నాడు? ఏ అవినీతి కేసుల భయం వెంటాడుతోంది? ఆరుకోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు ఎందుకు మోడీ కాళ్ళ దగ్గర తాకట్టుపెడుతున్నాడు? ఓటుకు నోటుతో సహా ఏ ఏ కేసుల భయంతో చంద్రబాబు ఇలా చేస్తున్నాడు అనే విషయాలు మాత్రం అస్సలు ప్రస్తావించకుండా తన ప్రభు భక్తిని మరోసారి నిరూపించుకున్నాడు.

ఏది ఏమైనా కాంగ్రెస్ నుంచి బయటకు రాబట్టే జగన్‌పై కేసులు, జగన్‌పై కేసులన్నీ కూడా రాజకీయ కక్ష్య సాధింపులో భాగమే అన్న నిజాలు బాబుకు ఆంతరంగీకుడైన రాధాకృష్ణ ఒప్పుకోవడం మాత్రం జగన్‌కి, వైకాపా జనాలకు నైతిక బలం ఇచ్చే విషయమే. సంవత్సరాలుగా జగన్‌పై తీవ్రస్థాయిలో అబద్ధాలు చెప్తూ వచ్చిన చంద్రబాబుతో పాటు ఆయన భజన మీడియా నైతికతను ప్రశ్నించేదే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -