Monday, April 29, 2024
- Advertisement -

తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డి ఓటమి ఖాయం…. 2019లో వైకాపాదే విజయం: ఆంధ్రజ్యోతి

- Advertisement -

రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రను నాటకాలతో వంచించి, 2014 ఎన్నికల సమయంలో ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి, మోడీ, పవన్‌ల సాయంతో కన్నులొట్టబోయి అన్నట్టుగా అధికారంలోకి వచ్చాడన్న మాటేగానీ చంద్రబాబుకు అస్సలు ఆనందం లేకుండా పోతోంది. ప్రత్యర్థి మీడియా ఏదీ లేనప్పుడు…..సొంత వర్గ మీడియా గుత్తాధిపత్యం నేపథ్యంలో చేసిన వీర భజనతో 2004కి ముందు కాస్త మంచి పరిపాలన ఇచ్చాడు అన్న పేరు అయినా మిగిలింది. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ మాత్రం…….. ఉత్త అబద్ధాల రాయుడు, వాగాడంబరం తప్ప చేతల్లో ఏమీ చేయలేని నాయకుడు, అవినీతి, అక్రమాలు చేయడానికి ఎంతకైనా దిగజారే నాయకుడు అన్న పేరు తెచ్చుకున్నాడు. ఇక మాట మార్చడం, మోసం చేయడం విషయంలో బాబు ప్రావీణ్యతను కూడా ప్రజలు బాగానే అర్థం చేసుకున్నారు. అందుకే చంద్రబాబుపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్రస్థాయి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత మొత్తాన్ని బిజెపిపైకి నెట్టేయాలని బాబు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు మాత్రం చంద్రబాబునే దోషిగా చూస్తున్నారు. నాలుగేళ్ళుగా ఎందుకు బిజెపి చెప్పిన ప్రతిదానికీ తలాడించావ్? అసలు 2014ఎన్నికల్లో మోడీ గొప్పోడు అని మాపైన ఎందుకు రుద్దావ్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలదీసి అడుగుతున్నారు.

ఆ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో టిడిపికి ఘోర ఓటమి తప్పదని ఇప్పటికే చాలా సర్వేలు తేల్చి చెప్పాయి. ఇప్పుడిక బాబు భజన మీడియా కూడా ఒక్కొక్క నియోజకవర్గం గురించి విశ్లేషిస్తోంది. తాజాగా జేసీ ప్రభాకరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టిడిపికి ఘోర ఓటమి తప్పదన్నట్టుగా రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. అవినీతి పంపకాల గొడవలు, నాయకుల మధ్య విభేదాలు, గొడవల నేపథ్యంలో తాడిపత్రి ప్రజలకు టిడిపి అంటేనే విసుగొచ్చిన పరిస్థితి. మరోవైపు జేసీ దివాకర్‌రెడ్డి కామెడీ వేషాలు, వెకిలి మాటలు కూడా తాడిపత్రితో పాటు అనంతపురం ప్రజలకు కూడా ఆగ్రహం తెప్పిస్తున్నాయి. అందుకే టిడిపి స్థానిక నేతలు కూడా జేసీల ధాటికి తట్టుకోలేక వైకాపా వైపు చూస్తున్నారు. ఒక వేళ వైకాపాలో చేరకపోయినప్పటికీ జేసీ ప్రభాకరరెడ్డిని ఓడించడానికి టిడిపి స్థానిక నాయకులే గ్రూపులు కట్టారట. జేసీని ఎలా అయినా ఓడిస్తాం అని శపథాలు చేస్తున్నారని ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది. మొత్తంగా ఆంధ్రజ్యోతి వార్త మొత్తం చూస్తే 2019ఎన్నికల్లో తాడిపత్రిలో టిడిపికి ఘోర ఓటమి తప్పదన్న ఆవేదనే కనిపించింది. ఇప్పటికే వచ్చిన సర్వేల్లో కూడా ఈ సారి జేసీలు ఓడడం ఖాయమని తేలింది. ఇప్పుడు స్వయంగా బాబు భజన మీడియా ఆంధ్రజ్యోతి కూడా అదే విషయం తేల్చేసిన నేపథ్యంలో ముందు ముందు చంద్రబాబు తీసుకోబోయే జాగ్రత్తలు ఎలా ఉంటాయో చూడాలి మరి. జగన్‌ గురించి, విజయమ్మ గురించి అత్యంత నీచంగా, దుర్మార్గపు మాటలు మాట్లాడిన జేసీలు ఓడిపోవాలని వైకాపా జనాలు మాత్రం గట్టిగా ప్రయత్నం చేస్తారు. అలాగే అనంతపురం ప్రజలు కూడా జేసీల మాటలు, చేతలతో విసుగెత్తిపోయి ఉన్నారన్నది నిజం. టిడిపి స్థానిక నాయకులు కూడా ఇప్పుడు పూర్తిగా జేసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మొత్తంగా చూస్తే 2019 ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో వైకాపా విజయం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు కూడా తేల్చిచెప్పేస్తున్నారు. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి సర్వే చేసిన ఒక జాతీయ మీడియా సంస్థ కూడా ఇదే విషయాన్ని తేల్చిచెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -